Samantha: సమంత, నాగచైతన్య వీరు విడిపోయి ఏళ్లు గడిచినా కానీ వీరి విడాకుల వార్తలు రోజు మనం ఏదో ఒక దగ్గర చూస్తూనే ఉంటాం. అసలు వీరు విడాకులకు కారణాలు ఏంటి అనేది ఇప్పటికి కూడా ఎవరికి తెలియకపోవడం శోచనీయం. ఎంతో అన్యోన్యంగా జీవించే ఈ జంటపై ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో వారి వివాహ బంధం అర్థరహితంగా ముగిసింది. వీరు విడిపోయి ఆనందంగా ఉన్నారో లేదంటే బాధపడుతున్నారో తెలియదు.
That one secret gift for Chaitu is Samantha still with her
కానీ వీరి విడాకుల వార్తలు విన్న అక్కినేని అభిమానులు మాత్రం ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారు. బంగారం లాంటి జంట ఇలా విడిపోయింది ఏంటి అంటూ మదన పడుతూనే ఉంటారు. అలా నాగచైతన్య సమంత విడాకులు తీసుకొని దూరంగా ఉన్న తర్వాత ఎవరి సినిమాల బిజీలో వారు పడ్డారు. ఇక సమంత మాత్రం మయోసైటిస్ బారిన పడి ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ మధ్య కాలంలోనే విదేశాల్లో చికిత్స తీసుకొని మళ్లీ సినిమాల్లో కం బ్యాక్ అయింది. (Samantha)
Also Read: Samantha: నిర్మాతగా మారుతున్న సమంత.. ఏకంగా అన్ని సినిమాలే ఒకేసారి మొదలు!!
అయినా అప్పటి లుక్ మాత్రం సమంతా లో కనిపించడం లేదు. ఇక నాగచైతన్య హిట్స్ ప్లాప్స్ అనే తేడా లేకుండా సినిమాల్లో దూసుకుపోతున్నారు. ఈ మధ్యకాలంలోనే శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే సమంత నాగ చైతన్య ప్రేమించుకుని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరు ప్రేమలో పడ్డప్పటి నుంచి మొదలు పెళ్లి విడాకులు అయ్యేవరకు ఎన్నో మెమోరబుల్ మూమెంట్లు ఉన్నాయి.
వీరి పెళ్లి సమయంలో అనేక గిఫ్టులు కూడా వచ్చాయట. అందులో నాగచైతన్య సమంతకు మధ్య ఒక తీపి గుర్తు ఉందట. వీరి ప్రేమ నుంచి పెళ్లి వరకు ఎన్నో తీపి గుర్తులను మంటల్లో కాల్చేసిన సమంత ఆ ఒక్క గిఫ్ట్ ను మాత్రం భద్రంగా దాచుకుందట. ఇంతకీ అది ఏంటయ్యా అంటే.. సమంత తల్లి తండ్రి నాగచైతన్య సమంత కలిసి దిగినటువంటి ఒక ఫ్యామిలీ ఫోటోను జ్ఞాపకంగా దాచుకుందట. ఈ ఫోటో తనకు ఎంతో స్పెషల్ అని అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.(Samantha)