The husband who tortured Rambha

Rambha: సీనియర్ నటి రంభ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. ఆమె కెనడా బిజినెస్ మాన్ ఇంద్రన్ పద్మనాథన్ ని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు తగ్గాక ఐటెం సాంగ్స్ లో కూడా రంభ చేసింది. కానీ ఆ తర్వాత పూర్తిగా అవకాశాలు తగ్గడంతో బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకొని కెనడాలో సెటిల్ అయింది.అయితే ఆ మధ్యకాలంలో రంభ తన భర్తకు విడాకులు ఇస్తుంది అంటూ ఒక వార్త మీడియాని కుదిపేసిన సంగతి మనకు తెలిసిందే.

The husband who tortured Rambha

ఇక హీరోయిన్ రంభ తన భర్తకు ఎందుకు విడాకులు ఇస్తుందో తెలియక ఆమె అభిమానులు అయోమయంలో పడ్డారు. ఇక ఆమె విడాకుల వార్తలు వైరల్ అయిన సమయంలో ఒక విషయం వినిపించింది. అదేంటంటే.. రంభ భర్త కేవలం రంభని తన కంపెనీకి మోడల్ గా పనికి వస్తుందనే ఉద్దేశంతోనే చేసుకున్నాడని,అందరి ముందు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మోడల్ గా పనిచేయమంటూ రంభని వేదించారట. (Rambha)

Also Read: Tamannaah: విజయ్ వర్మ కంటే ముందు ఆ ఇద్దరితో సె** చేశా.. తమన్నా బోల్డ్ కామెంట్స్.?

అయితే రంభ మాత్రం నేను సినిమాలు మానేసి చాలా రోజులు అయింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో లాగా ఉండలేను. అయినా ఇలా పొట్టి బట్టలు వేసుకొని అందరి ముందు మోడలింగ్ చేయడం ఏంటి? అది కూడా నేను పెళ్లి చేసుకున్నాక ఇలా చేయడం నీకుచేయమని చెప్పడం నీకు సిగ్గుగా అనిపించడం లేదా.. నీ కంపెనీ కోసం నన్ను పొట్టి బట్టలు వేసుకోమంటావా.. అంటూ మండిపడిందట. కానీ ఇంద్రన్ మాత్రం సినిమాల కోసం చేశావు కదా మన సొంత కంపెనీకి చేస్తే ఏమవుతుంది అని బెదిరించారట..

 The husband who tortured Rambha

కానీ రంభ మాత్రం నేను చేయనని భర్తతో గొడవలు పెట్టుకొని ఇండియాకి వచ్చేసిందట. అలా వీరి మధ్య కొద్ది రోజులు గొడవలు జరిగాయట.ఇక విడాకులకు కూడా ఫ్యామిలీ కోర్టులో అప్లై చేశారట. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు బంధువులు ఇద్దరి మధ్య సంధీ కుదిరించడంతో మళ్లీ కలిసి పోయారట. ఇక విడాకుల వార్తలు చాలా రోజులు వైరల్ అయినా కూడా రంభ స్పందించలేదు. కానీ మళ్ళీ ఎప్పుడైతే భర్తతో రంభ కలిసిపోయిందో ఆ సమయంలో మా విడాకులు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. మేము కలిసే ఉన్నాం అంటూ క్లారిటీ ఇచ్చింది.(Rambha)