Shradda Kapoor: ఏంటి ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ కి ఆ మెగా హీరోకి సంబంధం ఉందా? అదేలా ఆమె బాలీవుడ్ హీరోయిన్ ఈయన టాలీవుడ్ హీరో.. అలాంటిది వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి.. ఇంతకీ శ్రద్ధ కపూర్ కి ఏ మెగా హీరోతో సంబంధం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఈమధ్యనే స్త్రీ 2 అనే మూవీ తో వచ్చి బాలీవుడ్ లో సంచలనం సృష్టించింది.
The mega hero has a secret relationship with Shradda Kapoor
చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండానే బ్లాక్బస్టర్ హిట్ కొట్టేసింది. ముఖ్యంగా బాలీవుడ్లో జవాన్, బాహుబలి 2 వంటి రికార్డులను కూడా కొల్లగొట్టి స్త్రీ టు సంచలనం సృష్టించింది. అయితే అలాంటి ఈ హీరోయిన్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. అంతేకాదు స్త్రీ టు తో సంచనలనం సృష్టించినఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ఫాలోవర్స్ లో ఏకంగా పీఎం నరేంద్ర మోడీనే దాటేసింది. (Shradda Kapoor)
Also Read: Nayanthara: ఆ తెలుగు హీరోతో పీకల్లోతు ప్రేమలో నయనతార.. ఎంగేజ్మెంట్ వరకు వెళ్లి..?
ఇక గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ పేరు తాజాగా మరోసారి టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. అదేంటంటే శ్రద్ధా కపూర్ కి టాలీవుడ్ హీరో చిరంజీవికి మధ్య ఒక సంబంధం ఉందట. మరి ఆ సంబంధం మీరు అనుకున్నట్లు చెడు సంబంధం అయితే కాదు.ఇక అసలు విషయం ఏమిటంటే..శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ కూడా నటుడే..
ఆయన బాలీవుడ్ లో పవర్ఫుల్ విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించారు.అయితే శక్తి కపూర్ చిరంజీవి హీరోగా చేసిన యుద్ధభూమి మూవీలో విలన్ గా నటించారు. అలాగే చిరంజీవి తెలుగులో నటించిన ఎన్నో సినిమాలు హిందీలో రీమేక్ అయిన సమయంలో ఆ సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించారు. యుద్ధభూమి మూవీలో నటించినప్పటి నుండి చిరంజీవికి నటుడు శక్తి కపూర్ కి మంచి బాండింగ్ ఏర్పడిందట. దాంతో వీరిద్దరూ తరచూ కొన్ని పార్టీలలో కలుస్తూ ఉంటారట.(Shradda Kapoor)