Kushboo: ఏంటి కుష్బూ పెళ్లి జరగడానికి మరో హీరోయిన్ కారణమా.. ఆ హీరోయిన్ గనక లేకపోతే కుష్బూ సుందర్.సి ల వివాహం జరగకపోయేదా..ఇంతకీ కుష్బూ సుందర్ లను కలిపిన ఆ హీరోయిన్ ఎవరు..వీరిద్దరి పెళ్లికి పెద్దగా మారిన ఆ స్టార్ నటి ఎవరో ఇప్పుడు చూద్దాం.. కుష్బూ సుందర్ సి ల వివాహం జరగడానికి ప్రధాన కారణం ఎవరో కాదు హీరోయిన్ సౌందర్య అంటూ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో నటి కుష్బూ గుర్తుచేసుకుంది. మరి ఇంతకీ సౌందర్య ఎలా కారణమైంది అని మీరు అందరూ అనుకోవచ్చు.
The reason for Kushboo marriage is that heroine
అసలు విషయం ఏమిటంటే.. కుష్బూ భర్త సుందర్ సి నటుడు అలాగే దర్శకుడు అనే సంగతి చాలా మందికి తెలుసు.అయితే కుష్బూని పెళ్లి చేసుకోక ముందు సుందర్ సి హీరోయిన్ సౌందర్యని పెట్టి మూరై మామన్ అనే మూవీ తీయాలి అనుకున్నారట.అయితే ఆమె అప్పటికే సౌందర్య పెద్ద హీరోయిన్ కావడంతో తన సినిమాని ఓకే చెబుతుందో లేదో అని సుందర్ సి భయపడి హీరోయిన్ మీనాని తీసుకోవాలి అనుకున్నారట. అయితే మీనా కి సినిమా స్టోరీ చెప్పగా నాకు డేట్స్ ఖాళీ లేవు అని రిజెక్ట్ చేసిందట.ఇక మీనా రిజెక్ట్ చేయడంతో సౌందర్యను అడగడానికి భయపడడంతో చివరికి ఈ సినిమాలో కుష్బూని హీరోయిన్ గా తీసుకున్నారు. (Kushboo )
ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కుష్బూ సుందర్ సి మధ్య విడదీస్తే విడదీయలేని అనుబంధం పెరిగిపోయింది. అలా ఓ రోజు కుష్బూ దగ్గరికి వచ్చి సుందర్ సి మనిద్దరికీ పెళ్లి అయితే పిల్లలు పుడితే పిల్లలు నీలా ఉంటారా.. లేక నాలా ఉంటారా.. అని డైరెక్ట్ గా అడిగారట.అయితే సుందర్ సడన్గా అలా అడిగేసరికి కుష్బూ ఒక నిమిషం షాక్ లో మునిగిపోయిందట.ఆ తర్వాత నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావా అని అడగడంతో అవును అని చెప్పాడట. ఇక ఆయన గట్స్ కి ధైర్యానికి కుష్బూ ఫిదా అయింది.
అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటినుండే కుష్బూకి సుందర్ సి పై ఇష్టం పెరుగుతూ వచ్చిందట. అలా ఓవైపు ఇష్టం పెరిగి చివరికి సుందర్ ప్రపోజ్ చేయడంతో రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కడ కనిపించలేదు. దాంతో సుందర్ ప్రపోజ్ చేసిన వెంటనే కుష్బూ కూడా ఓకే చేసిందట. అలావీరి ప్రేమ గురించి కుష్బూ చెబుతూ ఆరోజు మురై మామన్ సినిమాలో గనుక సౌందర్య నటించి ఉంటే సుందర్ సి నాకు కలిసేవాడు కాదు.మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలై పెళ్లి చేసుకునే వాళ్ళం కాదు.ఒక రకంగా మా పెళ్లి జరగడానికి సౌందర్య కారణమైంది అంటూ చెప్పుకొచ్చింది.(Kushboo )