Prabhas: ఆరడగుల అందగాడు ప్రభాస్ పెళ్లి చూడాలని ఇప్పటికే కుటుంబంతో పాటు ఎంతో మంది అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక దేవుడు ఎప్పుడు కరుణిస్తారా అంటూ చూసే జనాల కంటే ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని చూసే జనాలే ఎక్కువైపోయారు. ఎందుకంటే ప్రభాస్ పెళ్లి పై అందరిలో ఒక ఆసక్తి అయితే నెలకొంది.ఎందుకంటే ఆయన ఎవరిని పెళ్లి చేసుకుంటారు. సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా..లేక బంధువుల అమ్మాయినా అనే ఒక ఆసక్తి అయితే అభిమానుల్లో నెలకొంది.
The reason for Prabhas not getting married
అయితే ప్రభాస్ పెళ్లిపై ఇప్పటికే ఎన్నో రూమర్స్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.అంతేకాదు త్రిష, అనుష్క, శృతి సనన్ వంటి హీరోయిన్లతో కూడా ప్రభాస్ ప్రేమాయణం, పెళ్లి ఇలా ఎన్నో రూమర్స్ వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఒక్క హీరోయిన్ తో కూడా తన లవ్ కన్ఫామ్ చేయలేదు ప్రభాస్. అయితే అలాంటి ఈ హీరో పెళ్లి చేసుకోకపోవడానికి అదే కారణం అంటూ ఓ సంచలన విషయాన్ని బయట పెట్టింది స్టార్ యాంకర్. మరి ఇంతకీ ప్రభాస్ పెళ్లి చేసుకోకుండా ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తుంది దేనికోసం అనేది ఇప్పుడు చూద్దాం. (Prabhas )
Also Read: Trisha: పీకల దాకా తాగిన త్రిషపై కన్నేసిన ఆ ఇద్దరు స్టార్లు..?
ప్రభాస్ పెళ్లి వార్తలపై ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో గాసిప్లు చక్కర్లు కొట్టాయి. అందులో ఒకటి ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు కూతుర్లకు పెళ్లి చేశాకే తాను పెళ్లి చేసుకుంటానని కొంతమంది అంటే,మరి కొంతమందేమో ప్రభాస్ లవ్ ఫెయిల్యూర్ అని,అందుకే పెళ్లి చేసుకోవడం లేదు అని అంటారు.ఇక ఇంకొంతమందేమో ప్రభాస్ సినిమాల బిజీలో ఉన్నారు అని ఇలా ఎవరికి తోచింది వాళ్ళు అనుకుంటూ ఉంటారు.
అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే అంటూ స్టార్ యాంకర్ సుమ కనకాల చెప్పింది. అదేంటంటే ప్రభాస్ పెళ్లి చేసుకుంటే అమ్మాయిలందరూ హర్ట్ అవుతారని,వారి హార్ట్ బ్రేక్ చేయడం ఇష్టం లేకే ప్రభాస్ ఇప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదు అంటూ చెప్పింది. అయితే సుమ నోటి నుండి ఏ ఆన్సర్ వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకి మరొకసారి నిరాశ తప్పలేదు. అలా సుమ చెప్పిన సమాధానానికి అందరూ ఆశ్చర్యపోయారు. మరి ప్రభాస్ ఈ ఏడాదైనా పెళ్లి చేసుకుంటారో లేదో చూడాలి.(Prabhas )