Sr.NTR: సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు.. మొదటి భార్య బసవతారకం మరణంతో ఆయన చాలా కృంగిపోయారు. ఇక బసవతారకం ఉండగానే ఓ హీరోని రెండో పెళ్లి చేసుకోవాలని కూడా ఎన్టీఆర్ చూశారు.కానీ ఈ విషయంలో ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు ఆ హీరోయిన్ కి వార్నింగ్ ఇవ్వడంతో సీనియర్ ఎన్టీఆర్ ఆ హీరోయిన్ ల పెళ్లి జరగలేదు. లేకపోతే ఆ రోజే ఆ హీరోయిన్ ని సీనియర్ ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకునేవారు. లక్ష్మీపార్వతి రెండో భార్యగా వచ్చేది కాదు.కానీ తలరాతలో ఏది ఉంటే అదే జరుగుతుంది అన్నట్లు ఆ హీరోయిన్ తో పెళ్లి క్యాన్సిల్ అయింది.
The reason for Sr.NTR second marriage is the hero’s wife
చివరికి లక్ష్మీపార్వతి రెండో భార్య అయింది.ఇక లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకోకుండా నందమూరి ఫ్యామిలీ ఎంతగా అడ్డుకున్నప్పటికీ ఎన్టీఆర్ ని కంట్రోల్ చేయలేకపోయారు.చివరికి వారిద్దరూ రెండు మూడు సార్లు పెళ్లి చేసుకున్నారు. అయితే చాలాసార్లు సీనియర్ ఎన్టీఆర్ ప్రాణాలను లక్ష్మీపార్వతి కాపాడిందట. అలా ఆయన దగ్గరుండి చూసుకోవడంతో ఎన్టీఆర్ కి లక్ష్మీపార్వతి మరింత దగ్గర అయింది. ఇక మేజర్ చంద్రకాంత్ సినిమా 100 డేస్ ఫంక్షన్ లో లక్ష్మీ పార్వతి ని రెండో భార్యగా అనౌన్స్ చేయాలి అని అనుకున్నారట.( Sr.NTR)
Also Read: Radha Ravi: “నాది తక్కువ కులం” అని అశ్వినీ దత్ సినిమా ఛాన్స్ ఇవ్వలేదు..కుల పిచ్చి బాగా..!!
కానీ ఆయన అనౌన్స్ చేసే సమయానికే లైట్లు పోయి మైక్స్ కట్ అయ్యాయని లక్ష్మీపార్వతి ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది.అలాగే వీరిద్దరిని కలిపింది హీరో మోహన్ బాబు భార్య నిర్మలా దేవట. మేజర్ చంద్రకాంత్ 100 డేస్ ఫంక్షన్ కి మోహన్ బాబుని తన భార్యతో రమ్మని చెప్పారట.అలాగే నిర్మలాదేవి కూడా ఆ ఫంక్షన్ కి వెళ్లి లక్ష్మీపార్వతి పక్కనే కూర్చుందట.ఆ తర్వాత ఎన్టీఆర్ నేను లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోబోతున్నాను అని స్టేజ్ మీద చెప్పే సమయంలో లైట్లు ఆఫ్ అయ్యి కరెంట్ కట్ అవ్వడంతో వెంటనే నిర్మలాదేవి ఆమెను తీసుకొని ఒక హోటల్ కి వెళ్ళిందట.
అక్కడికి సీనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చారట.నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నాతో రా లేకపోతే ఇప్పటినుండి నాకు కనిపించకు అని ఎన్టీఆర్ చెప్పారట. ఇక ఆ సమయంలో నిర్మలాదేవి కూడా పాజిటివ్‌గా ఆలోచించమని చెప్పడంతో అంతా ఆలోచించిన లక్ష్మీపార్వతి ఆయన్ని రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందట. అలా ఒక రకంగా సీనియర్ ఎన్టీఆర్ రెండో పెళ్లి జరగడానికి మోహన్ బాబు భార్య నిర్మలా దేవి కూడా కారణమైందని తెలుస్తుంది.( Sr.NTR)