Janhvi Kapoor: తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, తల్లి బాటలోనే తెలుగు తెరపై కూడా వెలుగొందుతుందని అందరూ భావించారు. ఆమెకు ఈ అవకాశం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ సినిమాలో లభించింది. అయితే, సినిమాలో జాన్వీ పాత్ర పరిమితంగా ఉండటంతో, ప్రేక్షకులకు ఆమెకు కావాల్సినంత స్కోప్ ఇవ్వలేకపోయారు.
The Scope of Janhvi Kapoor Role in Devara
జాన్వీ ‘తంగం’ అనే పాత్రలో కనిపించింది, అయితే ఈ పాత్రకు అంత ప్రాధాన్యం ఇవ్వకపోవడం గమనార్హం. సినిమాలో ఆమె కేవలం కొన్ని సన్నివేశాలు, ఒక పాటతో తన పాత్రను ముగించేసారు. దర్శకుడు కొరటాల శివ యాక్షన్ సన్నివేశాలు, హీరో ఎలివేషన్‌లపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో, హీరో-హీరోయిన్ మధ్య ప్రేమకథకు తగినంత స్థలం దొరకలేదు.
Also Read: Koratala Siva: కొరటాల శివ కూడా పూరీ లా అయ్యాడా.. దేవర కుడా సినిమానేనా!!
తనకు లభించిన పరిమిత సమయంలో జాన్వీ తన నటనను చక్కగా ప్రదర్శించింది. ఆమె తంగం పాత్రలో చలాకీగా, అందంగా కనిపించింది. అయితే, పాత్రకు మరింత లోతు ఇచ్చి ఉంటే, జాన్వీ కపూర్ తన ప్రతిభను మరింతగా చూపించే అవకాశం ఉండేదని చెప్పవచ్చు. ఈ పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దితే, ఆమెకు మంచి అవార్డులు రావడం ఖాయం.
జాన్వీ స్వయంగా చెప్పినట్లుగా, తన ప్రతిభను పూర్తిగా ప్రదర్శించే అవకాశం ‘దేవర’ రెండో భాగంలో ఉండొచ్చు. కానీ, ఈ భాగం ఎప్పుడు వస్తుందనేది ఇంకా తెలియలేదు, ఎందుకంటే ఎన్టీఆర్ వద్ద ఇంకా పలు సినిమాలు ఉన్నారు. మొత్తానికి, జాన్వీ తనకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంది, ఆమె భవిష్యత్తులో మరింత ప్రభావవంతమైన పాత్రలతో తెలుగు తెరపై మెరుస్తుందని ఆశిద్దాం.