Deepika Padukone: దీపిక పదుకొనే రణవీర్ సింగ్ లు రీసెంట్ గానే తల్లిదండ్రులయ్యారని, వీరికి పండంటి మగ బిడ్డ పుట్టారని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు,వీడియోలు చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే. ఓ స్వామిజీ చెప్పిన దాని ప్రకారమే దీపిక మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియాలో ఎన్నో రూమర్లు వినిపించాయి.కానీ ఇవన్నీ అవాస్తమని,దీపికా పదుకొనే డెలివరీ డేట్ కి ఇంకా సమయం ఉంది అని తెలుస్తుంది.
The secret behind Deepika Padukone green Banaras saree before delivery
ఎందుకంటే దీపికా డెలివరీ డేట్ సెప్టెంబర్ 28 కి చెప్పింది.కానీ అంతకంటే ముందే బాబు పుట్టాడు అని న్యూస్ వైరల్ అవ్వడంతో చాలా మంది షాక్ అయ్యారు. అయితే తాజాగా దీపిక తన బేబీ బంప్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా డెలివరీ ముందు ప్రముఖ ఆలయం అయినటువంటి ముంబైలోని సిద్ధి వినాయక టెంపుల్ ని రణవీర్ దంపతులు దర్శించుకున్నారు.(Deepika Padukone)
ఇక రన్వీర్ సింగ్ దీపిక పదుకొనేలు ఇద్దరు సిద్ధి వినాయక టెంపుల్ కి వెళ్లిన సమయంలో దీపిక ఆకుపచ్చ బనారస్ శారీలో చాలా సాంప్రదాయంగా కనిపించింది.అయితే ఈ ఆకుపచ్చ బనారస్ సారీ ఇప్పటిది కాదు ఒక వంద సంవత్సరాల క్రితం నాటి చీరను కాపీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆకుపచ్చ బనారస్ సారీ కట్టుకోవడం వెనుక మరో రహస్యం దాగి ఉందట.అదేంటంటే..దీపికా కట్టుకున్న బనారస్ సారీ ఎప్పటికీ కత్తిరించరాదట.
అంతేకాకుండా ఈ చీరని దీపికా కాకుండా ఆమెకు ఓ స్టార్ డిజైనర్ అయినటువంటి అనైతా ష్రాఫ్ అడజానియా బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది.డెలివరీకి ముందు ఈ ఆకుపచ్చ బనారస్ సారీ కట్టుకుంటే దీపిక కడుపులో ఉన్న బిడ్డకి అంతా శుభమే జరుగుతుంది అనే ఉద్దేశంతో అనైతా ఈ చీరను దాదాపు 6 నెలలు కష్టపడి తయారుచేసి దీపికకు బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. అలా ఆకుపచ్చ చీర దీపికా పడుకొనే గర్భంలోని బేబీకి శుభ సూచకంగా ఉండాలని ఇచ్చినట్టు తెలుస్తోంది.(Deepika Padukone)