Kalki: ప్రజెంట్ ఎక్కడ చూసినా కల్కి పూసే వినిపిస్తుంది. కేవలం మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఇక కల్కి సినిమాపై అభిమానులు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. సినిమా హిట్ అవుతుంది.. నో డౌట్ అయితే కలెక్షన్స్ పరంగా కూడా సినిమా క్రేజీ స్థానాన్ని దక్కించుకోవాలి. ఇక అప్పుడే చరిత్రలో కల్కి సినిమాకి ఒక మైల్ స్టోన్ క్రియాట్ అవుతుంది.
Also Read: Kalki: మరో రికార్డ్ సృష్టించిన కల్కి.. ఒక్క టికెట్ రూ. 2300..!
కాగా ఇదే క్రమంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కల్కి చిత్రం టికెట్ రేట్లు పెంచుతూ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాకి సపోర్ట్ చేసింది. తెలంగాణలో కూడా ఈ చిత్రం ఎక్స్ట్రా షోలకు టికెట్ల రేట్లు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఆంధ్ర గవర్నమెంటు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇక కల్కి సినిమా టికెట్ల ధర పెంచుతూ అదనపు షోలకి సైతం ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈనెల 27 నుంచి 2 వారాల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటుగా కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఇక నిర్మాత అశ్విని దత్ చేసిన వినతిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం కల్కి సినిమా చిత్రం టికెట్ సింగిల్ స్క్రీన్ పై 75 రూపాయలు మల్టీప్లెక్స్ లో 125 రూపాయల వరకు పెంచుకోవచ్చు అని పేర్కొంది.
అంతేకాకుండా ఒక రోజుకు ఐదు షోలు నిర్వహించుకునే విసులుబాటు కూడా కలిగించింది. దీంతో చాలా రోజుల తరువాత థియేటర్స్ కళకళలాడబోతున్నాయి. అయితే ఇదే మూమెంట్లో కల్కి టికెట్ రేట్లు ఎక్కువగా పెంచేశారు అంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కల్కి సినిమా టికెట్లు రేట్లు పెంచుతూ ఏపీ సర్కార్ ఇచ్చిన జీవో నీ సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఇక దీంతో మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ అని తెలిసి ఫ్యాన్స్ ఆనందంతో ఉంటే ఈ విధంగా సినిమాకి నెగిటివ్ టాక్ క్రియేట్ అవుతుందని నిరాశకు గురవుతున్నారు. మొత్తానికి కల్కి సినిమాపై ఏ న్యూస్ వైరల్ అయినా అది పాజిటివ్ బజ్ గానే మారుతుంది.(Kalki)