Rajamouli: పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళికి చుక్కలు చూపించారా.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు..ఎందుకు రాజమౌళి అంతలా భయపడ్డారు.. అసలు వారి మధ్య జరిగింది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఘనతని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన డైరెక్టర్ ఎవరు అంటే అందరికి టక్కున గుర్తుకువచ్చేది దర్శక ధీరుడు రాజమౌళి మాత్రమే. ఈయన తన దర్శకత్వ ప్రతిభతో ఆర్ఆర్ఆర్, బాహుబలి 1, బాహుబలి 2 వంటి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీసి ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో టాప్ ప్లేస్ సంపాదించుకున్నారు.
The star director who gave Rajamouli a lot of torture
ఇక ఒకప్పుడు తెలుగువారు అంటే చులకనగా చూసిన చాలామంది ఇతర ఇండస్ట్రీల జనాలు ప్రస్తుతం టాలీవుడ్ నే మెచ్చుకుంటున్నారు. అంతేకాదు టాలీవుడ్ సినిమాల్లో అవకాశాల కోసం పాకులాడుతున్నారు. అయితే ఇదంతా రాజమౌళి వల్లే అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి రాజమౌళి ఓ స్టార్ డైరెక్టర్ దగ్గర చాలా టార్చర్ అనుభవించారట. పట్టపగలే చుక్కలు చూసారట.. ఇక ఆ డైరెక్టర్ ఎవరో అనుకుంటున్నారా..ఆయన ఎవరో కాదు రాజమౌళి గురువు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. రాజమౌళి మొదట రాఘవేందర్రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన సంగతి మనకు తెలిసిందే. (Rajamouli)
Also Read: Vijay Thalapathy: విజయ్ కోసం కొట్టుకున్న ఇద్దరు హీరోయిన్లు అందుకే గొడవలా..?
అయితే ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. ఓ రోజు నేను రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్లాను. ఆ టైంలో ఆయన బయటికి వచ్చి రా రాజమౌళి మనం బయటికి వెళ్దామని చెప్పారు. ఇక ఆ కారులో ఆయన కూర్చునే సీట్ టర్కీ టవల్ వేసి చాలా వైట్ గా నీట్ గా ఉంటుంది. ఇక వెంటనే రాఘవేందర్రావు డ్రైవర్ రాకపోవడంతో ఆయనే డ్రైవర్ సీట్ లో కూర్చున్నారు.దాంతో ఇప్పుడు నేను ఎక్కడ కూర్చోవాలి.ఆ వైట్ కలర్ సీట్లో కూర్చుంటే ఏం దుమ్ము అంటుతుందోనన్న భయం.
అలాగే ఆయన డ్రైవర్ సీట్ లో కూర్చొని నేను కారు వెనకాల సీట్లు కూర్చుంటే అస్సలు బాగుండదు. దాంతో ఏం చేయాలో అర్థం కాక వెంటనే కార్ డోర్ తీసి ఆయన కూర్చునే సీట్లో కూర్చున్నాను. అయితే ఆ కూర్చోవడం కూడా సరిగ్గా కూర్చోలేదు.ఏదో గాలిలో అలా ఉండిపోయినట్టు భయం భయంగా కూర్చున్నాను. ఇక స్టార్ డైరెక్టర్ కారు నడుపుతుంటే నేను కూర్చున్నాను అనే ఆనందం నాలో ఏ మాత్రం లేదు. ఆయన కూర్చునే సీట్లో కూర్చుండి కూర్చుండనట్టు భయం భయంగా కూర్చున్నాను. ఆరోజు మాత్రం నాకు పట్టపగలే నరకం కనబడింది అంటూ ఆ ఇంటర్వ్యూ లో రాజమౌళి ఫన్నీగా చెప్పుకొచ్చారు.(Rajamouli)