Sunil: కమెడియన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం రజినీకాంత్,అల్లు అర్జున్ వంటి హీరోలకు విలన్ గా నటిస్తున్న సునీల్ పేరు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మార్మోగుతోంది.ఈయన కమెడియన్ గా.. విలన్ గా..హీరోగా.. ఎన్నో సినిమాల్లో నటించారు. అలాంటి ఈయన అవకాశాల కోసం త్రివిక్రమ్ తో తిరుగుతూ ఎన్నో పాట్లు పడ్డారు. అలా ఇండస్ట్రీలోకి త్రివిక్రమ్, సునీల్ ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇండస్ట్రీలో సునీల్ కి మంచి గుర్తింపు లభించాక ఒక మంచి కారు కొనుక్కుందాం అని అనుకున్నారట.
The star hero father insulted Sunil
కానీ ఈ విషయం తెలిసిన ఓ హీరో పెదనాన్న దగ్గర చెప్పగా ఆయన కారు కాదు నీకు ఆటో సెట్ అవుతుంది అని హేళన చేశారట. ఇక ఆయన ఎవరో కాదు రామ్ పోతినేని పెదనాన్న స్రవంతి రవి కిషోర్.. ఇదే విషయాన్ని సునీల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నేను కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాక నాకు సరిపోయే రేంజ్ లో ఐ 10 కారు కొందాం అని అనుకున్నాను. ఇదే విషయాన్ని నిర్మాత స్రవంతి రవి కిషోర్ గారికి చెప్పాను. (Sunil )
Also Read: Jayam Ravi: కుక్క కంటే హీనంగా.. భార్య చేసిన పనులు బయటపెట్టిన జయం రవి..?
కానీ ఆయన మాత్రం నీకు కారు కాదు ఆటో సెట్ అవుతుంది అని అనడంతో నేను షాక్ అయ్యాను. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు అనడంతో మరి నువ్వు మాట్లాడేది ఏంటి? ఐ 10 కారులో నీ పర్సనాలిటీ పడుతుందా.. నువ్వు అసలే బొద్దుగా ఉన్నావ్.దానికన్నా ఆటోలో కంఫర్ట్ గా కూర్చోగలుగుతావు. ఎలాగూ కారు కొనాలి అనుకుంటున్నావు కాబట్టి ఇంకాస్త మంచి కారు కొనుక్కుంటే బాగుంటుంది కదా..
నువ్వు కొనుక్కోవాలి అనుకుంటున్నా ఆ కారులో నీ కాళ్లు కూడా సరిగ్గా పెట్టుకోరాదు అంటూ చెప్పారు. ఇక ఆయన మాటలకు నేను ఆలోచనలో పడి కొద్ది రోజులు ఆగి మళ్ళీ ఎక్సంట్ టోర్నాడో అనే కారు కొన్నాను. ఇదే నా మొదటి కార్ అంటూ సునీల్ చెప్పుకొచ్చారు. ఇక సునీల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నిర్మాత స్రవంతి రవి కిషోర్ సినిమాల ద్వారానే.అలాగే త్రివిక్రమ్ సునీల్ ఫేమస్ అయింది కూడా ఈయన నిర్మాణంలో వచ్చిన సినిమాలతోనే.(Sunil )