Heroine: చాలామంది హీరోయిన్లు పెళ్లిని చాలా లేటుగా చేసుకుంటూ ఉంటారు.ఇక పిల్లల్ని కనడానికి కూడా టైం తీసుకుంటారు. కొంతమంది హీరోయిన్లు పిల్లల్ని తామే స్వయంగా కంటే మరి కొంతమంది సరోగసి పద్ధతిని ఎంచుకుంటారు. అలా ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది తమ అందం కాపాడుకోవడం కోసం సరోగసిని ఎంచుకున్న వారు ఉన్నారు.అయితే తాజాగా ఓ హీరోయిన్ ఒక బిడ్డ పుట్టిన వెంటనే మరో బిడ్డను కనడానికి రెడీ అయిపోయినట్టు తెలుస్తోంది.
The star Heroine who is going to be a mother for the second time
ఇక ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా..ఆమె ఎవరో కాదు ప్రణీత సుభాష్.. పెళ్లయ్యాక పిల్లల్ని కనడానికి చాలా సమయం తీసుకునే హీరోయిన్లు ఉన్న ఈ జనరేషన్లో బిడ్డ పుట్టిన వెంటనే మరో బిడ్డని కంటున్న ప్రణిత సుభాష్ వెరీ గ్రేట్ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక మరి కొంతమంది అమ్మడు వెరీ ఫస్ట్ అంటూ మాట్లాడుకుంటున్నారు. (Heroine)
Also Read: Sonakshi Sinha: పెళ్లైన నెలకే భర్తతో గొడవలు..?
అయితే తాజాగా ప్రణిత సుభాష్ సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో తన రెండో ప్రెగ్నెన్సీ విషయాన్ని పంచుకుంది. రౌండ్ 2.. ఇప్పటినుండి ఇలాంటి ప్యాంట్ లు నాకు పట్టవేమో అంటూ బేబీ బంప్ తో ఉన్న ఫోటోని షేర్ చేసి క్యాప్షన్ పెట్టింది.దీంతో ప్రణీత సుభాష్ రెండోసారి తల్లి కాబోతుంది అని ఈమె పోస్ట్ చూసిన సెలబ్రిటీలు, అభిమానులు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక ప్రణీత సుభాష్ వెంట వెంటనే ఇద్దరిని పిల్లల్ని కలవడానికి కారణం ఆమె మళ్లీ సినిమాల్లో రియంట్ ఇవ్వడం కోసమే ఇలా తొందరగా పిల్లల్ని కంటుంది అని కొంతమంది భావిస్తున్నారు. మరి చూడాలి ఈమె రెండో ప్రెగ్నెన్సీ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందా అనేది.(Heroine)
https://www.instagram.com/p/C91K0zSSoYf/?utm_source=ig_web_copy_link