Star heroine: బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో చేస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఈ అమ్మడు ఒకప్పుడు పలు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. రాఖీ అప్పట్లో స్పెఫల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి తన అందం, అభినయంతో విపరీతమైన పాపులారిటీ తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఇన రాఖి సావంత్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే..ఈ అమ్మడు ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది.
ఆ తర్వాత మరో వ్యక్తితో వివాహం బంధం లోకి అడుగు పెట్టింది. అయితే ఆమెకు అనారోగ్య సమస్యలు రావడంతో.. ఇటీవల హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసింది. ఈ క్రమంలో..అంతా ఫేమ్ కోసం డ్రామాలు చేస్తుందని అనుకున్నారు. కానీ రాఖి సావంత్ మాజి భర్త ఆమె అనారోగ్యంపై పలు కామెంట్స్ చేయటంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో ఈ అమ్మడు తొందరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇదిలా ఉంటే..తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రాఖీ సావంత్ తాను ఓ సర్జరీ చేయించుకున్నట్లు తెలిపింది. అలాగే ఓ భయంకరమైన విషయాన్ని డాక్టర్లు చెప్పటంతో బోరున ఏడ్చినని ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
“వైద్యులు బెక్ చేసినప్పుడు గుండె పోటు లక్షణాలున్నాయని చెప్పారు. కానీ ఆ తర్వాత వారు గర్భాశయంలోని ఓ కణితి గురించి సర్జరీ చేయించుకోవాలని లేదంటే ప్రమాదం అని అన్నారు. దీనితో నేను సర్జరీ చేయించుకున్నాను..కణితితో పాటు నాకు గర్భాశయాన్ని కూడా తొలగించారు. ఇక నేను ఎప్పటికీ తల్లిని కాలేను అని డాక్టర్లు చెప్పటంతో చాలా బాధపడ్డాను. నేను అమ్మ అవ్వాలంటే..సరోగసి ద్వారా పిల్లలను పొందాల్సిందే. జీవితంలో తల్లి కాలేను అన్నా బాధ నాకు చాలా ఉంది. అయితే నేను హాస్పటల్లో ఉన్నప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సాయం చేశారు. నాకు ఖర్చు అయిన డబ్బులు ఆయనే పే చేసి నన్ను పలకరించారు లైఫ్ లో మర్చిపోలేను “అని చెప్పుకొచ్చింది.