Heroine: చాలామంది హీరోయిన్లు లేదా హీరోలు ప్రేమించిన వారి చేతిలో మోసపోయి లేదా ఫ్యామిలీ కోసమో పెళ్లిళ్లు చేసుకోకుండా బ్రహ్మచారులుగా మిగిలిపోతూ ఉంటారు. అయితే ఈ హీరోయిన్ కూడా 50 ఏళ్లు దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉంటుంది.అయితే దానికి రెండు కారణాలు ఉన్నాయి అని చెబుతోంది.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..
The star Heroine who was away from marriage due to the cheating of her lover
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. నటి సితార అంటే ఇప్పటి జనరేషన్ కి కూడా తెలిసిన నటి. ఒకప్పుడు చాలా సినిమాల్లో హీరోయిన్ గా ఆ తర్వాత స్టార్ హీరోలకు చెల్లెలు,అక్క పాత్రలో నటించిన నటి సితార ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే పరిమితమైంది. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోనీ అందంతో ఉన్నప్పటికీ ఎందుకో ఈమె హీరోయిన్ కాలేకపోయింది.(Heroine)
Also Read: Venu Swamy: వేణు స్వామి తో చైతూ శోభిత లు విడిపోతారని చెప్పించింది సమంతనేనా..?
అయితే సితార 50 ఏళ్ళు దాటినా కూడా పెళ్లి చేసుకోలేదు. దానికి కారణం తాను ప్రేమించిన వాడు అని ఓఇంటర్వ్యూలో చెప్పింది.నేను ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. కానీ అతన్ని పెళ్లి చేసుకోలేకపోయాను. అయితే అతను వేరే పెళ్లి చేసుకున్నా కూడా అతని మీద ఉన్న ప్రేమను మర్చిపోలేక నేను పెళ్లికి దూరంగా ఉన్నాను.
ఇక నేను పెళ్లి చేసుకోకపోవడానికి మరో కారణం నా తండ్రి..నా ఫ్యామిలీని వదిలేసి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే నేను పెళ్లికి దూరంగా ఉన్నాను.. అంటూ సితార చెప్పుకొచ్చింది.సితార ప్రస్తుతం స్టార్ హీరో హీరోయిన్లకు తల్లి, అత్త పాత్రలు చేస్తూ కొన్ని సీరియల్స్ లో కూడా రాణిస్తుంది.(Heroine)