Bahubali: బాహుబలి..ఇండస్ట్రీ లెక్కలు మొత్తం తారుమారు చేసి పాన్ ఇండియా మూవీగా ఇతర ఇండస్ట్రీలకు చెమటలు పట్టించిన సినిమా ..అయితే అలాంటి ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఓ మ్యూజిక్ డైరెక్టర్ భార్య చాలా చీప్ గా మాట్లాడమే కాకుండా బోడి మూవీ అంటూ బాహుబలిని తక్కువ చేసి మాట్లాడిందట.మరి ఇంతకీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ భార్య ఎవరు..ఎందుకు అలా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రాజమౌళి సినిమాని తక్కువ చేసి మాట్లాడింది అనేది తెలుసుకుందాం…
The star music director’s wife mocked the Bahubali movie
బోడి సినిమా అంటూ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాను వెక్కిరిస్తూ మాట్లాడింది ఎవరో కాదు రాజమౌళి వదిన ఎం ఎం కీరవాణి భార్య శ్రీ వల్లి.. అయితే ఈ మాటలు ఏవో అసూయ, పగతో అన్నవి కావు. అలా సరదాగా మాట్లాడుకున్నవి.అయితే ఈ విషయాన్ని స్వయంగా న్యాచురల్ స్టార్ నాని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. (Bahubali )
Also Read: Rajamouli: పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి ఆ సినిమాని రీమేక్ చేశారని మీకు తెలుసా..?
బాహుబలి సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ అవ్వడంతో చాలామంది రాజమౌళి కి ఫోన్ చేసి విష్ చేశారు. అయితే ఆ టైంలో ఫోన్ చేసి విష్ చేయడం కన్నా ఇంటికి వెళ్లి కలిసి మాట్లాడడం బెస్ట్ అని అనుకున్నా నాని ఓసారి రాజమౌళి ఇంటికి వెళ్లారట. ఇక అప్పటికే లంచ్ టైం కావడంతో నానిని కూడా తినమన్నారట ఇంట్లోవాళ్ళు. అయితే నానిని చూసి రాజమౌళి పక్క థియేటర్లో బాహుబలి సినిమా చూద్దాం పదా అని చెప్పారట.
దానికి పక్కనే ఉన్న కీరవాణి భార్య శ్రీవల్లి తీసావులే ఓ బోడి సినిమా దాన్ని మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చూస్తావు అంటూ సరదాగా అనేసిందట. ఇక ఈ మాట విన్న నాని షాక్ లో మునిగిపోయాడట. ఎందుకంటే ప్రపంచమే గుర్తించే సినిమా తీసిన రాజమౌళి ఫ్యామిలీలో ఇంత సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారా అని ఆయనకు ఆశ్చర్యం కలిగిందట.ఇదే విషయాన్ని నాని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టి ఆశ్చర్యపోయారు.(Bahubali )