The Goat: వెంకట ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ హీరో నటుడు విజయ్ దళపతి హీరోగా చేసిన తాజా మూవీ ది గోట్.. విడుదలైన మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ది గోట్ మూవీ లో విజయ్ లుక్స్ ని చాలామంది విమర్శించారు.అంతేకాదు సోషల్ మీడియాలో ఈయన లుక్ పై ట్రోలింగ్ కూడా జరుగుతోంది.అయితే కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కి దగ్గరవుతుందని చెప్పుకుంటున్నారు.
The unlucky heroine who rejected The Goat movie
కానీ చిత్ర యూనిట్ తప్పుడు బాక్సాఫీస్ లెక్కలను చూపిస్తోందని 200 కోట్లు కూడా దాటకముందే 300 కోట్లు వచ్చింది 400 కోట్లు వచ్చింది అని పోస్టర్లు వేస్తున్నారని మీడియా బహిరంగంగానే చెబుతున్నారు. అసలు ఫ్లాప్ అయినా ఈ సినిమాని హిట్ అని ఎందుకు చెప్పుకుంటున్నారో తెలియడం లేదని కూడా మీడియా జనాలు మాట్లాడుకుంటున్నారు.అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక వైరల్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే..(The Goat)
Also Read: Rakul Preet Singh: ఆ హీరోయిన్ మీద ఇష్టంతో నన్ను 4 రోజులు వాడుకుని వదిలేసారు..?
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు.తండ్రి పాత్రలో నటించిన విజయ్ కి భార్యగా హీరోయిన్ స్నేహ నటించగా..కొడుకు పాత్రలో నటించిన విజయ్ కి జోడిగా మీనాక్షి చౌదరి నటించిందిఅయితే ఈ మూవీలో తండ్రి పాత్రకి జోడిగా నటించిన స్నేహని హీరోయిన్ గా తీసుకునే కంటే ముందు మరో హీరోయిన్ ని అనుకున్నారట. చిత్ర యూనిట్ .. స్నేహ కంటే ముందే నయనతారని ఫిక్స్ చేశారట. కానీ నయనతార రిజెక్ట్ చేయడం వల్ల స్నేహని తీసుకున్నారట.
ఇక నయనతార ఈ సినిమా మిస్ చేసుకున్నందుకు అస్సలు బాధపడలేదట.ఎందుకంటే ఈ సినిమా విడుదలయ్యాక మూవీ చూసిన నయనతార డైరెక్టర్ వెంకట్ ప్రభు కి ఫోన్ చేసి ఈ సినిమాలోని పాత్రలో స్నేహ నటించడమే మంచిదయింది. ఎందుకంటే ఆ సినిమాలోని పాత్రకి స్నేహ మాత్రమే న్యాయం చేసింది. ఆవిడే ఈ పాత్రకి కరెక్ట్ గా సెట్ అయింది అని ఫోన్ చేసి చెప్పిందట. అయితే ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు వెంకట్ ప్రభు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.(The Goat)