Sunitha: సింగర్ సునీత తన అద్భుతమైన వాయిస్ తో ఎంతోమందిని మైమరిపిస్తుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ల అందాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. సునీత సింగర్ మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా.. ఇప్పటి హీరోయిన్స్ అయినా తమన్నా,సమంత, కాజల్ వంటి హీరోయిన్లకు ఎన్నో సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పింది. ఇప్పటివరకు సునీత దాదాపు 500 కు పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పిందట.
To that star anchor Why is singer Sunitha so angry
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ అంటే ఆ స్టార్ యాంకర్ కి అస్సలు పడదట. మరి ఇంతకీ ఆ యాంకర్ ఎవరు.. వీరి మధ్య ఉన్న గొడవ ఏంటి అనేది చూద్దాం.. సింగర్ సునీత అంటే ఇష్టపడని యాంకర్ అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఒకప్పటి యాంకర్ ఉదయభాను మాత్రమే.అయితే గతంలో ఉదయభాను ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో సునీత పేరు చెప్పకుండా నేను అమెరికాకి ఓ ఈవెంట్ కి వెళ్ళిన సమయంలో ఆ సింగర్ ఆర్కెస్ట్రా నేను స్టేజ్ పైకి వెళ్తున్న సమయంలో స్యాడ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేసి నన్ను అవమానించారు.. (Sunitha )
నన్ను స్టేజ్ మీదకి కూడా పిలవలేదు.కానీ నేనే ధైర్యం చేసి వెళ్తే అలా చేశారు.ఆ టైంలో నేను ఎంతగానో ఏడ్చాను అంటూ చెప్పింది. అయితే ఈవిషయం చెప్పాక చాలామంది సింగర్ సునీతనే అంటూ ప్రచారం చేశారు. అయితే ఇది నిజమే కానీ ఈ విషయం గురించి సింగర్ సునీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికాలో నాకోసం ఒక సభ జరిగింది. ఆ టైంలో నేను ఉదయభాను ఏమీ అనలేదు.
కానీ ఆర్కెస్ట్రా వాళ్ళు స్యాడ్ మ్యూజిక్ వేశారని అది నేనే వేయించాను అని అనుకుంది. కానీ ఈ విషయం నాకు ఏ మాత్రం తెలియదు.అలాగే ఈ సంఘటన జరిగాక నేను చాలా సార్లు ఉదయభానుని కలిసినప్పుడు నవ్వుతూ పలకరించాను.కానీ ఉదయభాను మాత్రం చాలా కోపంగా నా వైపు చూసి వెళ్ళిపోయింది అంటూ సింగర్ సునీత క్లారిటీ ఇచ్చింది.(Sunitha )