Tollywood 2025: What Films Are on the Horizon for Sankranti

Tollywood 2025: సంక్రాంతి పండుగ అంటే టాలీవుడ్‌లో ప్రత్యేకమైన సందడి. పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరూ ఈ సీజన్‌లో తమ సినిమాలను విడుదల చేయాలని పోటీ పడతారు. 2025 సంక్రాంతికి కూడా ఇదే విధమైన పోటీ నెలకొంది. కానీ ఈసారి పండుగ బరిలో ఏ సినిమాలు ఉండబోతున్నాయో స్పష్టత ఇంకా లేదు. ఇప్పటివరకు, రామ్ చరణ్ నటిస్తున్న “గేమ్ ఛేంజర్” మరియు బాలకృష్ణ “NBK 109” సినిమాలు సంక్రాంతికి విడుదల అవుతున్నాయని తెలుస్తోంది. వీటితో పాటు వెంకటేష్ “సంక్రాంతికి వస్తున్నాం” మరియు నాగ చైతన్య “తండేల్” కూడా పోటీలో ఉన్నాయని అంటున్నారు. సాధారణంగా, పొంగల్ సీజన్‌లో నాలుగు సినిమాలకు స్థానం ఉంటుంది. కానీ, ఒకే బ్యానర్ నుంచి రెండు సినిమాలు వస్తాయా, లేదా పెద్ద నిర్మాణ సంస్థలు పోటీ పడతాయా అన్నది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.

Tollywood 2025: What Films Are on the Horizon for Sankranti

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మిస్తున్న “గేమ్ ఛేంజర్”పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా సంక్రాంతికి వస్తుండగా ఇదే బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ 50వ సినిమా “సంక్రాంతికి వస్తున్నాం” కూడా సంక్రాంతి బరిలో నిలవనుంది. ఈ సినిమా కోసం “విశ్వంభర”ను వాయిదా వేయించినట్టు తెలుస్తోంది. ఇక, బాలకృష్ణ మరియు బాబీ కాంబినేషన్‌లో “NBK 109” సినిమా కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతోంది. ఈ సినిమాలకు ఎక్కువ థియేటర్లు కేటాయించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా కూడా బరిలో ఉంటే, థియేటర్ల కొరత తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల, వెంకటేష్ సినిమా వెనక్కి తగ్గే అవకాశమున్నట్లు కూడా తెలుస్తుంది.

Also Read: Tollywood Releases: మెగా జాతరను మొదలుపెట్టనున్న వరుణ్ తేజ్.. ఇక బాదుడే బాదుడు!!

ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నాగచైతన్య, చందూ మొండేటి కాంబినేషన్‌లో రూపొందిస్తున్న “తండేల్” సినిమా కూడా 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఈ విధంగా జరిగితే, మెగా హీరోలు, నందమూరి, అక్కినేని హీరోల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది. అయితే, “తండేల్” జనవరిలో విడుదల కాకపోతే, పోటీ అంత రసవత్తరంగా ఉండకపోవచ్చు. రామ్ చరణ్ మరియు నాగ చైతన్య వంటి యువతరం హీరోల మధ్య పోటీ జరిగితే, సంక్రాంతి సందడి నిజంగా కనిపిస్తుంది.

“తండేల్” సినిమా కోసం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మూడు తేదీలను పరిశీలిస్తున్నారని సమాచారం. ఎక్కువ శాతం జనవరిలోనే విడుదల అయ్యే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు డిజిటల్ హక్కులను కొనుగోలు చేయడంతో, వారు కూడా జనవరిలోనే సినిమాను విడుదల చేయాలని ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఒకటి, రెండు రోజుల్లో విడుదల తేదీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.