Tollywood Stars and Their Name Changes

Tollywood Stars: టాలీవుడ్‌లో నటులు తమ పేర్లను మార్చుకోవడం ఇప్పుడు సాధారణంగా కనిపిస్తుంది. గతంలో చిరంజీవి, శివ శంకర్ వర ప్రసాద్ అనే పేరును మార్చుకుని చిరంజీవిగా మార్చుకున్నాడు. అయితే, ఇప్పుడు ఈ ట్రెండ్ మరింత పెరిగింది. పేరు మార్పుకు నుమరాలజీ, జ్యోతిష్యం వంటి కారణాలితో పాటు, బ్రాండింగ్, గుర్తుంచుకోవడానికి సులభంగా ఉండటం మరియు ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరుకోవడం వంటి అంశాలు కూడా కీలకంగా ఉంటాయి.

Tollywood Stars and Their Name Changes

సాయి ధరమ్ తేజ్ తన పేరును సాయి తేజ్‌గా మార్చుకున్నాడు.. ఆ తర్వాత సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నాడు. ఈ మార్పు ఆయన కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందా అనేది చూడాలి. అదే విధంగా, రామ్ పోతినేని కూడా రామ్‌గా పేరు మార్చుకోవడం ద్వారా తన ఇమేజ్‌ను మరింత పెంచుకున్నాడు. ఇక కన్నడ నటుడు కిచ్చా సుదీప్ తన పేరు సుదీప్‌గా మార్చుకోవడం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు. అలాగే, సందీప్ కిషన్ తన పేరును మార్చుకోవడం తో కెరీర్‌ను ముందుకు తీసుకువెళ్లగలిగాడు.

Also Read: Samantha: సమంత స్టామినా.. బాలీవుడ్ లో ప్రశంశల వర్షం!!

పేరు మార్పు వల్ల నటుడి వ్యక్తిత్వం, తెరపై ప్రెజెన్స్ మారుతాయి. కొత్త పేరు కొత్త శక్తిని ఇస్తుందని నమ్ముతారు. ప్రేక్షకులు కూడా నటుడిని కొత్త రూపంలో చూడటానికి ఆసక్తి చూపిస్తారు. పేరును మార్చడం, ఒక రకంగా, నటుడికి పునర్జన్మ లాంటిదే.

కొంతమంది నటులు తమ సినీ కెరీర్ ప్రారంభంలో పెట్టుకున్న పేర్లను కొనసాగించడం కష్టంగా భావిస్తారు. కొత్త ట్రెండ్స్ మరియు కొత్త మార్కెట్లను అనుగుణంగా మారాలనే ఉద్దేశంతో పేర్లు మార్చుకుంటారు. ఇది వారి సినీ జీవితంలో కొత్త అవకాశాలను తెచ్చే అవకాశం ఇస్తుందని ఆశిస్తారు. అయితే, పేరు ఎలా ఉన్నా, చివరికి నటుడి ప్రతిభ మరియు కృషి మాత్రమే ఆయనను విజయపథంలో నడిపిస్తాయి.