Genelia: బాయ్స్, బొమ్మరిల్లు, రెడీ, హ్యాపీ,శశిరేఖ పరిణయం, ఢీ,నా అల్లుడు వంటి సినిమాల్లో హీరోయిన్గా చేసిన జెనీలియా తెలుగులో స్టార్ స్టేటస్ తెచ్చుకుంది.అలా స్టార్ హీరోలతో జతకట్టిన జెనీలియా తర్వాత బాలీవుడ్ కి వెళ్లి బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్స్ అందుకుంది.ఇక ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్లిందో అప్పటినుండి సౌత్ సినిమాలకు దూరమైంది. అంతేకాకుండా అక్కడే బాలీవుడ్ నటుడు అయినటువంటి రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి పెళ్లాడింది.
Torture Genelia to do that in the middle of the night
ప్రస్తుతం వీళ్ళిద్దరికీ ఇద్దరు బాబులు కూడా ఉన్నారు. గత కొద్దిరోజులుగా సౌత్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ మంచి అవకాశం వస్తే మళ్లీ సౌత్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది.అయితే అలాంటి జెనీలియాని ఓ డైరెక్టర్ అర్ధరాత్రి ఆ పని చేయమని వేధించాడట.మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? బన్నీ ఎంట్రీ తో సీన్ మొత్తం ఎలా రివర్స్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం.. జెనీలియాని అర్ధరాత్రి విసిగించింది ఎవరో కాదు బొమ్మరిల్లు భాస్కర్.(Genelia)
Also Read: Heroine: వెంకటేష్ హీరోయిన్ కి 600 కోట్ల ఆస్తి ఇస్తానన్న డైరెక్టర్.. కానీ.?
ఇక విషయంలోకి వెళ్తే..బొమ్మరిల్లు సినిమా చేసే సమయంలో డైరెక్టర్ భాస్కర్ సిద్ధార్థ్, జెనిలియా ఇద్దరు నైట్ పూట ఐస్క్రీమ్ తినే సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారట.అయితే ఈ షూట్ చేసే సమయంలో అర్ధరాత్రి 9 అవుతున్నా కూడా షూట్ ముగించలేదట. అంతేకాకుండా జెనీలియా కరెక్ట్ గా డైలాగులు చెప్పకపోవడంతో ఇంకాస్త కరెక్ట్ గా చెప్పమని అడిగారట. దాంతో మండిపడిన జెనీలియా ఆ మాత్రం డైలాగులు నాకు చెప్పడానికి రాదా..
అసలు ఈ సినిమా వద్దు ఈ ఆఫర్ వద్దు నేను ఇంటికి వెళ్ళిపోతాను అని వెళ్లి పోయిందట.అయితే ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ ఒక్కరోజు పరిచయంతోనే డైరెక్టర్ ఎలాంటి వాడో చెప్పేస్తారా.. ఆ డైరెక్టర్ చాలా మంచివాడు. నీకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టుతుంది అని జెనీలియాకి సర్ది చెప్పారట అల్లు అర్జున్. అయితే అదే సమయంలో బన్నీతో జెనీలియా హ్యాపీ మూవీ షూటింగ్లో కూడా చేస్తోంది.అలా అల్లు అర్జున్ చెప్పిన మాట విని బొమ్మరిల్లు సినిమా షూటింగ్ కి వెళ్లిందట. అలా ఆరోజు జెనీలియాతో గొడవ జరిగింది అనే విషయాన్ని బొమ్మరిల్లు భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.(Genelia)