Bharateeyudu2: లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన “భారతీయుడు 2” శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలైంది. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రాగా ఇది 1996లో వచ్చిన “ఇండియన్” చిత్రానికి సీక్వెల్. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అయితే తొలి షో నుంచే భారతీయుడు నెగిటివ్ టాక్ తో ముందుకు వెళ్ళింది. కలెక్షన్స్ కూడా చాలా పేలవంగా ఉన్నాయి. సినిమా నిడివి ఎక్కువగా ఉందని, అనవసరమైన సన్నివేశాలు ఉన్నాయని సినిమా చూసిన చాలా మంది విమర్శించగా ఈ మేరకు శంకర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
Trimming Bharateeyudu2 lengthy scenes
శంకర్ ఈ చిత్రానికి కొన్ని సవరణలు చేయాలని నిర్ణయించుకున్నాడట. సినిమాలోని 20 నిమిషాల అనవసర యాక్షన్ సన్నివేశాలను కట్ చేయబోతున్నాదట. సినిమాలో కమల్ ఆలస్యంగా కనిపించడం, పలు సన్నివేశాల్లో ప్రసంగం లాంటి డైలాగ్ లు ‘భారతీయుడు 2’ చిత్రానికి ప్రతికూల సమీక్షలు రావడానికి కారణం కాగా ఈ కారణంగానే సినిమా లోని ఆయా సన్నివేశాలను తొలగించానున్నారట. విడుదలైన మూడో రోజు కొన్ని బోర్ కొట్టించే సన్నివేశాలను తొలగించాలని దర్శకుడు శంకర్ నిర్ణయించుకున్నాడు.
Also Read: Anant Ambani Marriage: అంబానీ ఇంట్లో పెళ్లి కి వెళ్ళిన సెలెబ్రిటీలకు కోట్లలలో గిఫ్ట్ లు!!
రన్నింగ్ టైమ్ దాదాపు 3 గంటలు. ఇప్పుడు..ట్రిమ్ చేసిన తర్వాత 2 గంటల 40 నిమిషాలకు తగ్గుతుందని అంటున్నారు. ‘భారతీయుడు2’లో రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, ప్రియా భవానీ శంకర్ మరియు బాబీ సింహా లు నటించారు. 1996లో “ఇండియన్” సినిమాలో సేనాపతి పాత్రను కమల్ హాసన్ కొనసాగించాడు. ఈ చిత్రంలో కూడా సేనాపతి లంచం మరియు అవినీతికి వ్యతిరేకంగా నిలబడతాడు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించగ తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో ‘భారతీయుడు 2’ సినిమాకు రూ.12 కోట్ల గ్రాస్ రాగా ఇప్పటికే నెగిటివ్ టాక్, అందుకున్న ఈ సినిమా లోని సీన్లు తీసేసినా ఆడియెన్స్ ఏ మేరకు థియేటర్లకు వెళ్తారనేది చూడాలి?