Trisha: ఏంటి త్రిష నిజంగానే పెళ్ళై ఇద్దరు కొడుకులు ఉన్న ముసలి హీరోతో మూడు ముళ్ళు వేయించుకోబోతుందా.. మనం వింటున్నది నిజమేనా.. ఎందుకు త్రిష అలాంటి పాడు పని చేస్తుంది..అసలు త్రిషకి ఏమైనా మైండ్ దొబ్బిందా..అని ఈ వార్త విన్న చాలా మంది అనుకుంటారు.మరి ఇంతకీ త్రిష ఇన్ని రోజులుగా సింగిల్ గా ఉండి పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న హీరోని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
Trisha married that star hero
త్రిష పెళ్లి చేసుకోవాలని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే అలాంటి పెళ్లి కబురు రానే వచ్చింది .త్రిష పెళ్ళై ఇద్దరు కొడుకులు ఉన్న హీరోని పెళ్లి చేసుకోబోతుందట.అది కూడా టాలీవుడ్ హీరో. అసలు విషయం ఏమిటంటే..త్రిష మూడు ముళ్ళు వేయించుకోబోయేది ఎవరితోనో కాదు నాగార్జునతో..ఏంటి మేం వినేది నిజమేనా అని అందరూ నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు. అయితే ఇది నిజమే. (Trisha)
Also Read: Shruti Haasan: ఆ హీరోలు నాకంటే పొట్టి గా ఉంటారు.. శృతి హాసన్ మాటలు ఆ హీరోనేనా?
కానీ రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. ఇక అసలు విషయం ఏమిటంటే.. నాగార్జున తన 100వ సినిమాపై ఇప్పటివరకు ఏ విషయాన్ని కూడా అంతగా బయటికి చెప్పడానికి ఇష్టపడడం లేదు. తన 100వ సినిమాపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడాలని చూస్తున్నారు.ఎంత ఆసక్తి ఉంటే సినిమా అంత హిట్ అవుతుంది అనే ఉద్దేశంతో నాగార్జున తన 100వ సినిమాకి సంబంధించి ఏ విషయాన్ని కూడా బయట పెట్టలేదు.
అయితే తాజాగా ఫిలింనగర్ నుండి చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం నాగార్జున 100వ సినిమాలో కథానాయికగా హీరోయిన్ త్రిషని ఎంపిక చేశారట చిత్ర యూనిట్. ఈ సినిమాలో నాగార్జునకి భార్య పాత్రలో త్రిష నటిస్తుందట.ఇక సినిమా షూటింగ్లో భాగంగా త్రిష నాగార్జునతో మూడు ముళ్ళు కూడా వేయించుకుంటుందట. అయితే ఈ న్యూస్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ నాగార్జున త్రిష కాంబినేషన్లో నిజంగానే సినిమా రాబోతుందా అని కామెంట్స్ పెడుతున్నారు.(Trisha)