Trisha: ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు సీనియర్స్ అయ్యాక అవకాశాలు రాకపోవడంతో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అవ్వడమో లేదా సినిమాల్లోనే విలన్ లేదా తల్లి పాత్రల్లో నటించడం చేస్తారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం అందుకు భిన్నం. ఒకానొక దశలో ఆమె కెరియర్ అయిపోయింది అనుకున్నారు. కానీ సడన్గా మళ్లీ ఒకే ఒక్క సినిమాతో కం బ్యాక్ ఇచ్చింది. ఇక ఆ నటి ఎవరో కాదు త్రిష.
Trisha who sold the 8 crore house for that hero expenses
ఒకప్పుడు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ తర్వాత అవకాశాలు తగ్గడంతో టాలీవుడ్ కు పూర్తిగా దూరమైంది. కానీ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పోన్నియన్ సెల్వన్ మూవీతో ఒక్కసారిగా మళ్లీ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఈమె చేతిలో యంగ్ హీరోయిన్లకు కూడా లేనన్ని ప్రాజెక్టులు వచ్చి పడ్డాయి. అలా ప్రస్తుతం ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తున్న త్రిష గురించి గత కొద్ది రోజులుగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.(Trisha)
Also Read: Sunil: సీనియర్ యాంకర్ తో సునీల్ సీక్రెట్ రిలేషన్..?
అదేంటంటే..కోలీవుడ్ నటుడు విజయ్ తో ఈ ముద్దుగుమ్మ డేటింగ్ లో ఉందని,త్వరలోనే విజయ్ భార్యకు విడాకులు ఇచ్చి త్రిషని భార్యగా చేసుకుంటాడనే టాక్ వినిపిస్తోంది.ఇదంతా పక్కన పెడితే..తాజాగా త్రిష తన ఇంటిని ఆ హీరో ఖర్చుల కోసం మరో హీరోకి అమ్మేసిందనే ప్రచారం జరుగుతుంది. ఇక ఆ హీరో ఎవరో కాదు సీనియర్ నటుడు భానుచందర్.. అయితే ఓ ఇంటర్వ్యూలో బాలచందర్ త్రిష ఇంటిని మేము కొన్నామని, నా భార్యకు పూలు నాకు చెట్లు అంటే ఇష్టమని ఆ ఇంటిని మొత్తం పువ్వులు చెట్లతో నింపేస్తామని చెప్పేశారు.
ఇక ఇప్పుడు త్రిష ఆ ఇంటిని చూస్తే మా ఇల్లు ఇంతలా చేంజ్ అయిందా అని షాక్ అవుతుంది అని కూడా చెప్పారు. అయితే ఈ విషయం తెలిసిన కొంత మంది నెటిజన్స్ త్రిష విజయ్ పార్టీ పెడుతున్నాడు కాబట్టి ఖర్చుల కోసమని ఇల్లు కూడా అమ్మేసిందని కొంతమంది నెటిజన్లు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు.ఎందుకంటే బాలచందర్ ఇల్లు కొనుగోలు చేసింది ఇప్పుడైతే కాదు. గతంలోనే అంటే త్రిష తండ్రి వాళ్ళ ఇంటిని భానుచందర్ కి అమ్మేసారట.. ఇక త్రిష ఇంటిని కొనుగోలు చేసాక భానుచందర్ కి చాలా బాగా కలిసొచ్చిందట.అంతే కాదు ప్రస్తుతం ఆ ఇంటి ధర 8 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.(Trisha)