Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. ఒకప్పుడు బుల్లి తెరపై కనిపించి ఆకట్టుకున్న ఈ నటి, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌లో తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. దక్షిణాది నుండి బాలీవుడ్ వరకు ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి, దీంతో మృణాల్ దర్శక నిర్మాతలకు ఒక హాట్ ఫేవరేట్‌గా నిలిచింది.

Unveiling the Mystery Behind Mrunal Thakur Edited Image

ఇటీవల మృణాల్ ఠాకూర్ ఉన్న ఓ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాత్ టబ్‌లో గ్లామరస్ గా పోజులిస్తూ కనిపించిన ఆమె, తెలుపు రంగు టూ-పీస్ డ్రెస్‌లో అందాలను ప్రదర్శించింది. ఈ చిత్రాన్ని చూసి అభిమానులు ఫిదా అయ్యారు, కొందరు ఆమెను “హాట్ నెస్ గాడెస్” అని కూడా పిలిచారు. అయితే, ఆ చిత్రం ఒరిజినల్ కాదు; అది ఎడిట్ చేసిన చిత్రం అని తెలిసింది.

Also Read : Tamannaah Bhatia: మనీ ల్యాండరింగ్ కేసులో ఇరుక్కున్న తమన్నా.. జైలుకి పోక తప్పదా?

నిజానికి, ఆ చిత్రంలో ఉన్నది మృణాల్ ఠాకూర్ కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్..ఆమె పేరు ఋతుపర్ణ బాసక్. ఋతుపర్ణ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన చిత్రాన్ని ఎవరో తీసుకుని, ఆమె ముఖానికి బదులు మృణాల్ ముఖాన్ని మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ చిత్రం వైరల్‌గా మారింది. ఋతుపర్ణ కూడా ఆ చిత్రంలో అందంగా కనిపించింది, ఆమె సహజ అందానికి అభిమానులు మంత్రముగ్ధులయ్యారు.

ఈ చిత్రాల గురించి మృణాల్ ఠాకూర్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన “విశ్వంభర”లో నటిస్తోంది. మృణాల్ తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.