Vaishnav Tej: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంతటి ఆదరణ ఉంటుందో అందరికీ తెలుసు.. అలాంటి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చి స్టార్లుగా కొనసాగుతున్నారు.. అలాంటి మెగా ఫ్యామిలీకి చెందినటువంటి యంగ్ హీరోలలో సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మంచి ఊపు మీద దూసుకెళ్తున్నారు.. అలాంటి ఈ యంగ్ హీరోలు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి.
Vaishnav Tej married before brother Match fix with that heroine
గత కొన్ని నెలల కిందట మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం తర్వాత చాలామంది వైష్ణవ తేజ్, సాయిధరమ్ తేజ్ పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. ఇదే తరుణంలో సాయి ధరంతేజ్ కంటే ముందే వైష్ణవ తేజ్ పెళ్లి బాటలో నడుస్తున్నారని తెలుస్తోంది.. ఈ కుర్ర హీరో ఒక క్రేజీ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారట. ఆమె ఎవరు వివరాలు చూద్దాం.. (Vaishnav Tej)
Also Read: Prabhas: 2000 కోట్ల బడ్జెట్ తో భారీ సినిమా చేస్తున్న ప్రభాస్.. బొమ్మ అదుర్స్ కదూ!!
ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి వైష్ణవ్ తేజ్ అద్భుతమైన హిట్ సాధించారు.. ఇక ఈ మూవీ తర్వాత పలు చిత్రాల్లో నటించిన అవి పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు..ఇదిలా ఉండగా వైష్ణవి తేజ్ ఒక యంగ్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారట.. ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే శ్రీ లీలా.. గత కొంతకాలం నుంచి వీరి మధ్య పరిచయం ఏర్పడిందట. గత సంవత్సరం విడుదలైన ఆదికేశవ చిత్రంలో వీరు కలిసి నటించారు.
ఈ టైం లోనే వీరి మధ్య ఫ్రెండ్ షిప్ ఏర్పడి అది కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. అప్పటి నుంచి వీరిద్దరూ వారి సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారట. అంతేకాదు తరచూ పలు ప్రైవేటు పార్టీలు ఈవెంట్లకు వెళ్తూ సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారట.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా రాస్తున్నారు. మరి చూడాలి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియాలి అంటే వారే స్వయంగా స్పందించాలి..(Vaishnav Tej)