Varsha Bollamma: సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న కుర్ర హీరోయిన్లలో వర్ష బొల్లమ్మ ఒకరు.ఈమె తన యాక్టింగ్ తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఓ యంగ్ హీరోని పెళ్లి చేసుకోబోతుందట.వీరిద్దరి మధ్య గత కొద్ది రోజులుగా ప్రేమాయణం నడుస్తుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు టాలీవుడ్ మీడియాలో కూడా వర్ష బొల్లమ్మ యంగ్ హీరోకి సంబంధించిన వార్తలు కుప్పలు తెప్పలుగా చక్కర్లు కొడుతున్నాయి.
Varsha Bollamma fell in love with the young hero
మరి ఇంతకీ వర్ష బొల్లమ్మ పెళ్ళంటూ వస్తున్న ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.. టాలీవుడ్ యంగ్ బ్యూటీ వర్షబొల్లమ్మ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది తమిళ్ మూవీస్ ద్వారా.అలా తెలుగులోకి చూసి చూడంగానే అనే మూవీతో వచ్చింది. ఈ సినిమా తరువాత జాను మూవీలో కూడా నటించింది. కానీ వర్ష కి నటిగా గుర్తింపు తీసుకువచ్చింది మాత్రం విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే మూవీతో..(Varsha Bollamma)
Also Read: Trisha: ఆ నిర్మాత లైఫ్ మొత్తం నాశనం చేసిన త్రిష..?
ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన వర్షబొల్లమ్మకి మంచి ఇమేజ్ రావడంతో ఆ తర్వాత పుష్పక విమానం, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం,ఊరి పేరు భైరవకోన అనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.అలా ఈమె చివరిగా ఊరి పేరు భైరవకోన అనే మూవీ తో మన ముందుకు వచ్చింది. అయితే అలాంటి వర్ష బొల్లమ్మ స్వాతిముత్యం సినిమా చేసే సమయంలో యంగ్ నటుడు బెల్లంకొండ గణేష్ బాబుతో ప్రేమలో పడిందని తెలుస్తోంది.
ఇక బెల్లంకొండ గణేష్ బాబు ఎవరో కాదు. స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ బాబు తనయుడు అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు కూడా.. అలా బడా ఫ్యామిలీ నుండి గణేష్ బాబు ఇండస్ట్రీకి హీరోగా ఏంటి ఇచ్చారు. ఇక వర్ష, గణేష్ కాంబినేషన్లో వచ్చిన స్వాతిముత్యం సమయం నుండి వీరిద్దరి మధ్య ప్రేమ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు వర్ష బొల్లమ్మ గణేష్ బాబుతో పెళ్లికి కూడా రెడీ అయినట్టు టాలీవుడ్ మీడియా లో టాక్ వినిపిస్తోంది.(Varsha Bollamma)