Venkat Prabhu: ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు అంటే తెలియని వారు ఉండరు. ఈయన దర్శకత్వం వహించిన తాజా మూవీ ది గోట్ విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. అయితే అలాంటి వెంకట్ ప్రభు తెలుగులో నాగచైతన్య కృతి శెట్టి కాంబినేషన్ లో వచ్చిన కస్టడీ మూవీకి దర్శకత్వం వహించిన సంగతి మనకు తెలిసిందే.
Venkat Prabhu: The film flopped because of Naga Chaitanya
అయితే మానాడు వంటి సినిమా విడుదలైన తర్వాత వచ్చిన కస్టడి సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే తాజాగా ఈ బాక్సాఫీస్ ఫలితం గురించి మాట్లాడుతూ.. వెంకట్ ప్రభు సంచలన కామెంట్స్ చేశారు. రీసెంట్ గా ది గోట్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వెంకట్ ప్రభు కి కస్టడీ సినిమా రిజల్ట్ గురించి ప్రశ్న ఎదురయ్యింది..(Venkat Prabhu)
Also Read: Ranbir Kapoor: ప్రభాస్ హీరోయిన్ ని రే** చేయాలనుకున్న రణబీర్ కపూర్..?
దాంతో వెంకట్ ప్రభు మాట్లాడుతూ.. నేను ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీశాను. అలాగే ఈ సినిమా స్టోరీ చాలా బాగుంది. కానీ ఈ సినిమా స్టోరీలో నిర్మాత, హీరో వేలు పెట్టడం వల్లే ఇలా జరిగింది.ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంలో నా తప్పు ఏమీ లేదు అంటూ వెంకట్ ప్రభు సంచలన కామెంట్స్ చేశారు.
ఇక నాగచైతన్య సినీ కెరియర్ లోనే కస్టడి మూవీ భారీ డిజాస్టర్ అవడంతో చాలామంది దర్శకుడిని తిట్టుకున్నారు. కానీ అసలు నిజం అది కాదని నిర్మాత, హీరో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సినిమా ప్లాప్ అయిందని వెంకట్ ప్రభు చెప్పారు. మరి డైరెక్టర్ కామెంట్స్ పై నిర్మాతలు నాగచైతన్య ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.(Venkat Prabhu)