Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీకి దారుణమైన ఎదుగుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎవరు ఊహించలేని విధంగా ఓటమిపాలైంది. కేవలం 11 ఎమ్మెల్యే సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఈ ఘోరమైన ఓటమిని చవిచూసిన తర్వాత వైఎస్ఆర్సిపి వరుసగా సమీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఆ పార్టీకి ఎప్పుడు వరుసగా ఏదో ఒక తలనొప్పులు ఎదురవుతూనే ఉన్నాయి. కొందరు నేతలు పార్టీని వీడుతున్నారు. Vidadala Rajini

Vidadala Rajini into Janasena Party

ఇప్పటికే మాజీ మంత్రులు రావెల కిషోర్ బాబు, శిద్దా రాఘరావులు పార్టీకి వీడ్కోలు పలికారు. తాజాగా మరో మాజీ మంత్రి పార్టీని వీడుతున్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ మంత్రి మరెవరో కాదు విడదల రజిని. ఈ విషయం తెలిసి వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు షాక్ లో మునిగిపోయారు. విడదల రజిని పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు అనేక రకాల వార్తలు వస్తున్నాయి. జాతీయ పార్టీ నేతలతో విడదల రజిని చర్చలు జరిపినట్లు కొందరు ప్రచారాలు చేస్తున్నారు. Vidadala Rajini

Also Read: Telangana: తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం..రేవంత్ సంచలన నిర్ణయం ?

అంతేకాకుండా ఆమె ఫోన్ లో కూడా టచ్ లో లేదని అంటున్నారు. అధిష్టాన పెద్దలకు అస్సలు అందుబాటులో ఉండడం లేదని అంటున్నారు. అయితే ఇదంతా సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమేనని వైఎస్సార్సీపీ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా కొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రచారాలు చేస్తున్నారంటున్నారు. ఇక ఇటు విడుదల రజిని… వైయస్ఆర్సీపీ పార్టీని వీడి జనసేన పార్టీలోకి మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జనసేన పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో వారితో చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. Vidadala Rajini