Vijay Deverakonda: 2025 సంక్రాంతి సినిమాల రేసులో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొదట జనవరి 10న విడుదల కావాల్సిన చిరంజీవి “విశ్వంభర” డిజిటల్ రైట్స్ ఒప్పందాల కారణంగా వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం మార్చి 28న విడుదలయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో క్రిస్మస్కి విడుదల కావాల్సిన రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” సంక్రాంతి బరిలోకి దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, ఈ మార్పులతో సినిమాల విడుదల షెడ్యూల్ పూర్తిగా మారిపోయింది.
Vijay Deverakonda Pan India Clash with Chiranjeevi and Pawan Kalyan
మార్చి 28న “విశ్వంభర”తో పాటు విజయ్ దేవరకొండ “VD12”, పవన్ కళ్యాణ్ “OG”, మరియు “హరి హర వీరమల్లు” చిత్రాలు కూడా సిద్ధంగా ఉండటం, బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీని సూచిస్తోంది. అయితే, పవన్ కళ్యాణ్, సితార ఎంటర్టైన్మెంట్స్ మధ్య మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో “OG” మరియు “VD12” లలో ఎదో ఒకటే వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, “హరి హర వీరమల్లు” విడుదల తేదీ కూడా మారే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Devara 2: దేవర 2 కోసం భారీగా ప్లాన్ చేసిన కొరటాల.. బాలీవుడ్ స్టార్ హీరోలకు గాలం!!
ఇందులో మరో కీలక ట్విస్ట్ ఏమిటంటే, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన “సికిందర్” కూడా మార్చి చివర్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పాన్ ఇండియా స్థాయి చిత్రం తెలుగు చిత్రాలపై ప్రభావం చూపడం ఖాయం. “విశ్వంభర”, “VD12”, “OG”, లేదా “హరి హర వీరమల్లు” ఏదైనా సినిమా సల్మాన్ ఖాన్ చిత్రం “సికిందర్”తో మేజర్ పోటీకి దిగాల్సి వస్తుంది.
మొత్తానికి ఇన్ని తెలుగు సినిమాలలో మార్చి 28న ఏ సినిమా విడుదల అవుతుందో చూడాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే. నిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీలను మార్చుకునే అవకాశాలు ఉన్నందున, పాన్ ఇండియా పోటీని ఎదుర్కొనేలా నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తుంది. ఏదేమైనా ఈ విడుదల తేదీ విషయంలో విజయ్ దేవరకొండ కు మంచి ప్లస్ ఉందని చెప్పాలి. ఎందుకంటే చిరు, పవన్ కు పాన్ ఇండియా మార్కెట్ లేదు. సల్మాన్ కు తెలుగు లో మార్కెట్ లేదు. పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ ఉన్న విజయ్ దేవరకొండ కి ఈ తేదీలో తన సినిమా వస్తే మంచి లాభం ఉంటుంది.