Vijay gave that hero an unforgettable gift in life

Vijay: కోలీవుడ్ నటుడు విజయ్ తలపతి అంటే ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమాలను సంపాదించుకున్న హీరో.. అయితే అలాంటి విజయ్ తలపతి రీసెంట్ ది గోట్ మూవీలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 450 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే తెలుగులో ఎక్కువ కలెక్షన్లు సాధించకపోయినప్పటికీ తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాని బాగా ఆదరించారు.

Vijay gave that hero an unforgettable gift in life

అలా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ది గోట్ మూవీ లో కొన్ని సన్నివేశాలు సినిమాకి ప్లస్ అయ్యాయి. అందులో ఒకటి ఈ మూవీలో స్పెషల్ రోల్స్ లో కనిపించిన శివ కార్తికేయన్,త్రిషలు.. అలాగే త్రిష ఇందులో ఒక స్పెషల్ సాంగ్ లో కూడా చేసింది. అయితే ఇప్పటివరకు త్రిష అలాంటి సాంగ్స్ లో చేయకపోయినప్పటికీ ఈ సినిమాలో చేసేసరికి ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది అని చెప్పుకోవచ్చు.(Vijay)

Also Read: Krithi Shetty: మలయాళంలో తొలిచిత్రంతోనే 100 కోట్ల క్లబ్ లోకి వెళ్తున్న కృతి శెట్టి!!

అయితే ఈ మూవీ హిట్ అవ్వడంలో త్రిష, శివ కార్తికేయన్ లు కూడా భాగమవ్వడంతో శివ కార్తికేయన్ కి విజయ్ దళపతి ఎప్పటికి గుర్తిండి పోయేలా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారట. అయితే దీనికి సంబంధించి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.మరి ఇంతకీ కోలీవుడ్ హీరో విజయ్ తలపతి శివ కార్తికేయన్ కి ఇచ్చిన గిఫ్ట్ ఏంటయ్యా అంటే ఒక లగ్జరీ వాచ్ అంట..అవును మీరు వినేది నిజమే.

 Vijay gave that hero an unforgettable gift in life

తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో శివ కార్తికేయన్ కి చాలా ప్రేమగా విజయ్ తలపతి ఒక లగ్జరీ వాచ్ ని ఆయన చేతికి పెడుతున్నారు.దీంతో ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్స్ తన సినిమాలో గెస్ట్ రోల్ లో నటించిన శివ కార్తికేయన్ కి ఎప్పటికి మర్చిపోకుండా ఉండేలా ఒక లగ్జరీ వాచ్ ని విజయ్ గిఫ్ట్ గా ఇచ్చారని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Vijay)