YCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు మాత్రమే వైసిపి పార్టీ పరిమితమైంది. అటు పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాలు మాత్రమే సంపాదించుకోగలిగింది వైసిపి. దీంతో ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి వైసీపీ ఎదుర్కొంటుంది. YCP
Vijayamma enters the field for YCP social media
ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి సర్కార్ వైసీపీని టార్గెట్ చేసి మరీ పాలన కొనసాగిస్తోంది. అలాగే ఎన్నికల కంటే ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేక విఫలమవుతోంది. అయితే దీన్ని ఓటమి తర్వాత వైసిపి సోషల్ మీడియా సరిగా ప్రచారం చేయడం లేదని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. YCP
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పిఠాపురం వర్మ
ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారట. వైసీపీ సోషల్ మీడియా టీంలో కొత్త సారధిని రంగంలోకి దించారట. వైయస్ విజయమ్మ సోదరుడు సుదర్శన్ రెడ్డి అల్లుడు… యశ్వంత్ రెడ్డి ని సోషల్ మీడియా టీంలో జాయిన్ చేశారట. ఇక సజ్జల కుమారుడు భార్గవ్ తో కలిసి వైసిపి సోషల్ మీడియాను హ్యాండిల్ చేయబోతున్నాడట యశ్వంత్ రెడ్డి. YCP
ఇక యశ్వంత్ రెడ్డి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వింగ్ మళ్లీ యాక్టివ్ అయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏ చిన్న తప్పు చేసిన.. తాటతీస్తామని.. వైసీపీ నేతలు చెబుతున్నారు. YCP