Ys Sharmila: వైఎస్‌ మరణానికి కారణమైన వారితో షర్మిల కుమ్మక్కు ? అయ్యారని… షర్మిలపై విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ…నా వయసు 67 ఏళ్ళు నేను రాజారెడ్డి, వైస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ లకు ఆడిటర్ గా చేశానని వెల్లడించారు. YS బ్రతికున్నప్పుడే కూతురు కొడుకు కు ఆస్తుల పంపకాలు జరిగాయని తెలిపారు. షర్మిల ది ఆస్థి తగాదా కాదు అధికారం కోసం తగాదా ..మరల జగన్ సీఎం కాకూడదు అని షర్మిల ఆరాటం అంటూ నిప్పులు చెరిగారు.

Vijayasaireddy comments on Ys Sharmila

మీ నాన్న YS మీద కేసులు పెట్టిన కాంగ్రెస్ ,బాబు లతో నీవు కలిసిపోయావ్ అంటూ ఆగ్రహించారు. YS చనిపోవడానికి 15 రోజుల ముందు భూమి మీద ఉండడు YS అని బాబు అనలేదా అని నిలదీశారు. నీవు రాసిన లేఖ..నీవు ఇవ్వకపోతే బాబు కి ఎల్లో మీడియా చేతికి ఎలా వచ్చిందన్నారు విజయసాయిరెడ్డి. 2019 లో జగన్ సీఎం అయినాక చెల్లి మీద ప్రేమ్మతో “సొంతంగా సంపాదించిన” ఆస్తిలో కోర్ట్ కేసులు పూర్తి అయినాక 40 శాతం ఇస్తాను అని చెప్పి షర్మిల కు MOU ఇవ్వడం జరిగిందన్నారు.

Also Read: Errabelli Dayakarrao: దీపావళికి కాంగ్రెస్ లో బాంబులు పేలడం గ్యారెంటీ ?

షేర్లు ఆస్తుల పంపకాలు కోర్ట్ కేసులు పూర్తి అయినాక మాత్రమే చేయాలి..లేకపోతె కోర్టు ఇబందులు వస్తాయి అని ఇద్దరు రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జీలు చెప్పారని… కానీ షర్మిల ఏమి చేసింది అని ప్రశ్నించారు. షేర్స్ ఎక్కడో పోయాయి అని చెప్పి జగన్ కు తెలియకుండా దొంగ సంతకాలతో షేర్స్ ట్రాస్న్ఫర్ చేయించారని వివరించారు. దీని వలన జగన్ బెయిల్ క్యాన్సిల్ అయి జైలుకు వెళ్లే అవకాశం ఉంది..ఇదే కదా బాబు కోరుకుంటోందని పేర్కొన్నారు. మొదట్లో సాక్షి ఏటా 20 కోట్ల నష్టం చూసింది… భారతి సిమెంట్స్ కు 1400 కోట్లు అప్పు చేసి తరువాత పెట్టుబడులు తీర్చారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఎప్పుడైనా ఒక రూపాయి పెట్టుబడి పెట్టావా? అంటూ షర్మిలను నిలదీశారు.