Vineeth Family Life: 1990ల దశకంలో తెలుగు చలనచిత్ర రంగంలో తన ప్రత్యేకతను చాటుకున్న విలక్షణ నటుడు వినీత్. తెలుగు సినీ ప్రేక్షకులను మాత్రమే కాదు, తన నటనతో తమిళం, మలయాళం భాషల్లో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వినీత్‌కి అప్పట్లో మంచి ఫాలోయింగ్ ఉండేది. ‘జెంటిల్మెన్,’ ‘సరిగమలు,’ ‘వైఫ్ ఆఫ్ వరప్రసాద్,’ ‘నీ ప్రేమకై’ వంటి చిత్రాల్లో నటించిన వినీత్, కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.

Vineeth Family Life and His Quiet Departure

వినీత్ కేవలం నటుడిగానే కాకుండా మంచి డాన్సర్ గానూపేరు తెచ్చుకున్నాడు. భరతనాట్యంలో విశేష ప్రతిభ కలిగిన వినీత్ అనేక కచేరీల్లో తన నృత్యాన్ని ప్రదర్శించి అభిమానులను ముగ్ధులను చేశాడు. నటనకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా వినీత్ సంప్రదాయాలను, క్రమశిక్షణను పాటించే వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. 2004లో చెన్నైకి చెందిన ప్రిన్సిల్లా మీనన్‌ను వివాహం చేసుకున్న వినీత్‌కి అవంతి వినీత్ అనే కుమార్తె ఉంది. సాధారణంగా వినీత్ కుటుంబం మీడియా వద్దకి ఎక్కువగా రాకపోవడాన్ని ఇష్టపడుతుంది, తమ వ్యక్తిగత జీవితాన్ని మీడియా దృష్టికి దూరంగా ఉంచడంలోనే ఆనందాన్ని కలిగిస్తుంది కాబోలు.

Also Read: Mega and Nandamuri Fans: మెగా అభిమానులను రెచ్చగొట్టిన ఎన్టీఆర్ అభిమానులు.. ఇంతకన్నా అవమానం ఉందా?

కానీ, ఇటీవల సోషల్ మీడియాలో వినీత్ కుటుంబ ఫోటోలు వైరల్ కావడం పెద్ద సంచలనం సృష్టించింది. అభిమానులు చూపిన ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ, సరైన కథలు లభిస్తే మళ్ళీ సినిమాల్లో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వినీత్ వెల్లడించారు. నటనలో ఇంకా అనేక పాత్రలకు తాను ప్రాణం పోయగల నైపుణ్యం ఉందని తనలో స్ఫూర్తి ఇంకా అలాగే ఉందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు వినీత్ అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి.

వినీత్ వంటి నటులు తెలుగు చిత్రసీమకు ఎంతో ముఖ్యమైన నటులు. తన ప్రతిభ, క్రమశిక్షణ, కుటుంబ పట్ల ఉన్న అంకిత భావం తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన పాత్రల్లో వినీత్‌ని చూడాలని కోరుకుంటున్నారు.