Vishal: ఏ ఇండస్ట్రీలో అయినా నటీనటుల మధ్య కాస్త క్లోజ్ నెస్ పెరిగింది అంటే అది లేనిపోని ఎఫైర్లకు దారితీస్తూ ఉంటుంది.. ఒక హీరో వరుసగా రెండు నుంచి మూడుసార్లు ఒకే హీరోయిన్ తో నటిస్తే, ఇక వారి మధ్య ఏదో జరుగుతుందని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ విధంగానే నటి అభినయ విషయంలో ఇదే జరిగింది.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఈ చిత్రంలో వెంకటేష్ మహేష్ బాబులకు చెల్లెలుగా నటించారు అందాల నటి అభినయ..
Vishal marriage with that star actress
అయితే ఈమెను చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది కానీ, ఈమె పూర్తిగా మూగ చెవిటి అమ్మాయి.. కేవలం సైగలు తప్ప మరేది అర్థం కాదు. అయినా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలు హీరోయిన్స్ గా నెగిటివ్ రోల్స్ లో కూడా మెప్పిస్తూ దూసుకుపోతోంది.. ఈమెతో పోల్చుకుంటే అన్ని సక్రమంగా ఉన్నటువంటి నటీనటులు వేస్ట్ అని చెప్పవచ్చు.. తెలుగులో శంభో శివ శంభో, రాజు గారి గది 2, సీతారామం, గామి, ది ఫ్యామిలీ స్టార్, కింగ్ వంటి సినిమాల్లో కూడా నటించింది.. (Vishal)
Also Read: Ramayana: రెండు భాగాలుగా రామాయణం..భారీస్థాయిలో రణబీర్ కపూర్ సినిమా!!
ఇలా ఎంతో బిజీగా ఉన్నటువంటి అభినయ కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి విశాల్ తో ప్రేమలో పడ్డారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మార్క్ ఆంటోనీ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు.. ఈ చిత్రం షూటింగ్ టైంలో ఇద్దరు మధ్య ప్రేమ చిగురించిందని త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని అనేక వార్తలు షికార్లు కొట్టాయి. అయితే అప్పట్లో ఈ రూమర్లకు అభినయ చెక్ పెట్టినా కానీ వార్తలు ఆగడం లేదు..
తాజాగా తన తండ్రితో కలిసి అభినయ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు కీలక విషయాలను బయటపెట్టింది. తాను 15 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే విశాల్ మూవీలను చూస్తూ వస్తున్నానని, ఆయనకు నేను పెద్ద అభిమానినంటూ చెప్పుకొచ్చింది. ఆయన ఎన్నోసార్లు కలుద్దామని అనుకున్న, చివరికి ఆయనతో నటించే అవకాశం లభించిందని అన్నది. ఇలాంటి మా ఇద్దరికీ పెళ్లి అని రూమర్స్ రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పుకొచ్చింది. మా మధ్య అలాంటిదేమీ లేదని ఖరాకండిగా చెప్పేసింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.(Vishal)