Vision 2047: Chandrababu Naidu Ambitious Plans

Chandrababu Naidu: అమరావతిలో 7 అంతస్తుల CRDA కార్యాలయ భవన నిర్మాణ పనులను ప్రారంభించిన రోజున, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. ఈ సందర్భంలో, ఆయన చరిత్రను తిరగరాసేందుకు సిధ్దమైనామని ప్రకటించారు. “ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి హైదరాబాద్ ను అభివృద్ధి చేయడానికి ఎన్నో సవాళ్లను అధిగమించాం. 8 లైన్ల రోడ్ల నిర్మాణం, శంషాబాద్ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలను కేటాయించడం వంటి నిర్ణయాలు తీసుకున్నాం. దార్శనిక అభివృద్ధి ఎల్లప్పుడూ ప్రతిఘటనలను ఎదుర్కొంటుంది,” అని చంద్రబాబు అన్నారు.

Vision 2047: Chandrababu Naidu Ambitious Plans

అమరావతి భూసేకరణకు సంబంధించిన సవాళ్లను గుర్తుచేస్తూ, “రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించేందుకు రైతులు 54 వేల ఎకరాలను ఇచ్చారు. ముఖ్యంగా మహిళా రైతులు వైసీపీ ప్రభుత్వానికి ధైర్యంగా ఎదురుదెబ్బవేశారు,” అని ఆయన తెలిపారు. “ఒక రాష్ట్రం – ఒకే రాజధాని అనేది నా స్పష్టమైన వాదన. విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా, కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తాం,” అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Also Read: Chandrababu Naidu: మోడి కనుసన్నల్లోనే చంద్రబాబు, పవన్ అడుగులు వేస్తున్నారా?

Vision 2047 గురించి మాట్లాడిన చంద్రబాబు, “నేను 2020 గురించి మాట్లాడినప్పుడు, చాలామంది నన్ను 420 అని ఎగతాళి చేశారు. కానీ చివరికి వారు 420లుగా మిగిలిపోయారు. సైబరాబాద్ అభివృద్ధి చూడండి. 2047 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలి,” అని ఆకాంక్షించారు. చంద్రబాబుకు విశ్వాసం ఉన్నట్లుగా, Vision 2047 ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను అద్భుతంగా అభివృద్ధి చేస్తామంటూ ఆయన ధృడ సంకల్పం వ్యక్తం చేశారు.