We are not getting a Divorce star hero heroine gave a twist

Divorce: ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలోని చాలా జంటలు విడాకులు తీసుకొని విడిపోతున్న ఘటనలు అనేకం చూస్తున్నాం.. చిన్న చిన్న విషయాలకే సర్దుకోలేక విడాకులు తీసుకొని పిల్లలని అనాధలుగా మారుస్తున్నారు.. వందేళ్లు జీవించాల్సిన జంటలు, రెండేళ్లు మూడేళ్లు కూడా కలిసి బ్రతకడం లేదు. విడాకులు తీసుకున్న స్టార్ జంటల్లో సమంతా నాగచైతన్య, ధనుష్ ఐశ్వర్య, ఉన్నారు..వీరు పెళ్లిళ్లు చేసుకుని ఒక అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకున్న తర్వాత విడాకులు తీసుకొని, ఎవరి జీవితాన్ని వారు చూసుకుంటున్నారు..

We are not getting a Divorce star hero heroine gave a twist

విడాకుల బాటలో ఎంతోమంది నటీనటులు వెళ్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.. ఇదే తరుణంలో ఈ జంట కూడా విడాకులు తీసుకొని విడిపోతున్నారని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై వారు ఏ మాత్రం స్పందించలేదు.. తాజాగా వీరిద్దరూ కలిసి దీపావళి సందర్భంగా సోషల్ మీడియాలో కనిపించడంతో, వీరి విడాకుల వార్తలకు చెక్ పడ్డట్టు అయింది. (Divorce)

Also Read: Janhvi Kapoor: ఆ హీరో తో బెడ్ సీన్స్ కి రెడీ అంటున్న జాన్వీ కపూర్.. బోల్డ్ స్టేట్మెంట్స్!!

ఇంతకీ వారు ఎవరయ్యా అంటే ఆది పినిశెట్టి నిక్కీ గల్రాని. ఆది పినిశెట్టి స్టార్ డైరెక్టర్ అయినా రవి రాజా పినిశెట్టి కుమారుడు.. ఈయన తెలుగులో ఒక విచిత్రం, వైశాలి, గుండెల్లో గోదారి, మలుపు, ఏకవీర, నిన్ను కోరి, మరకతమణి, రంగస్థలం, అజ్ఞాతవాసి, వంటి ఎన్నో చిత్రాల్లో నటించాడు. ఇందులో కొన్ని చిత్రాల్లో హీరోగా మరికొన్ని చిత్రాల్లో విలన్ గా చేశాడు.. అయితే ఆది పినిశెట్టి నిక్కీ మరకతమణి అనే చిత్రంలో మొదటిసారి జంటగా నటించారు. ఇక అప్పుడే మొదలైన వీరి ప్రేమ పెళ్లికి దారితీసింది.

We are not getting a Divorce star hero heroine gave a twist

చివరికి కుటుంబ సభ్యులను ఒప్పించి మే 18, 2022లో పెళ్లి ద్వారా ఒకటయ్యారు.. మీరు పెళ్లి తర్వాత మధ్యకాలంలో వీరిద్దరు విడిపోతున్నారని కొన్ని వార్తలు వినిపించాయి.. కానీ అందులో నిజం లేదని తాజాగా దీపావళి సందర్భంగా తేలింది. దీపావళి సందర్భంగా ఈ జంట టపాసులు కాలుస్తూ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వారి విడాకుల వార్తలకు చెక్ పడ్డట్టయింది.(Divorce)