RGV: దివంగత నటి శ్రీదేవి బోని కపూర్ ని పెళ్లి చేసుకున్న సమయంలో రాంగోపాల్ వర్మ చాలా బాధపడ్డారు అనే విషయాన్ని ఇప్పటికే ఆయన పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో చెబుతూ ఉంటారు.అంతే కాదు శ్రీదేవిని గాఢంగా ప్రేమించిన ఆర్జివి ఆమెని ఒక దేవతల ఆరాధించాడు. ఇక ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు వల్ల చిన్నతనంలోనే శ్రీదేవి చనిపోయి ఉండేది అనే విషయం చెప్పగా శ్రీదేవికి ఏమైనా అయితే నా చేతిలో మీరు చనిపోయేవారు అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు ఆర్జీవి.
What did RGV do on the night Sridevi married Boney Kapoor
అయితే ఎంతో గాఢంగా ప్రేమించి ఆరాధించిన శ్రీదేవికి పెళ్లి అయిన సమయంలో రాంగోపాల్ వర్మ చాలా బాధపడ్డారట. శ్రీదేవికి పెళ్లయిన సమయంలో అందరికంటే ఎక్కువ బాధపడే వారిలో రాంగోపాల్ వర్మ నే ముందు ఉంటారని ఎన్నో ఇంటర్వ్యూలలో ఈ విషయం చాలామంది సినీ సెలబ్రిటీలు సైతం బయటపెట్టారు.(RGV)
Also Read: Madhavi Latha: కావాలంటే చిల్లర పడేస్తాం అంటూ హోం మంత్రిని చెడుగుడు ఆడుకున్న మాధవిలత..?
అంతేకాదు శ్రీదేవి సౌత్ ఇండస్ట్రీలోని కమల్ హాసన్, రాజశేఖర్, రజినీకాంత్ వంటి వారిని పెళ్లి చేసుకుంటుందని ఎన్నో వార్తలు వినిపించాయి.కానీ వారెవరితో జరగకుండా చివరికి బాలీవుడ్ స్టార్ నిర్మాత బోననీ కపూర్ ని పెళ్లాడింది.అంతేకాదు శ్రీదేవి బోని కపూర్ లకు పెళ్లైన సమయంలో ఆర్జీవి ఈ విషయం తెలిసి మీకు పాదాభివందనాలు అంటూ స్వయంగా అన్నారట.
అంతేకాదు ఆయన్ని ఆమె పెళ్లి చేసుకున్న సమయంలో చాలా బాధపడ్డారట కూడా.. ఇక ఈ విషయాన్ని తాజాగా సినీ రచయిత కనగల జయకుమార్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. శ్రీదేవి మరణించిన సమయంలో రాంగోపాల్ వర్మ ఎంతలా బాధపడ్డారో చెప్పనక్కర్లేదు. ఇప్పటికి కూడా ఆయనకి శ్రీదేవికి సంబంధించిన ప్రశ్న ఎదురైతే ఎంతో ఆసక్తికరంగా ఆయన శ్రీదేవి గురించి మాట్లాడతారు.(RGV)