Lavanya: నిన్న మధ్యాహ్నం నుండి రాజ్ తరుణ్ యువతి లావణ్యల వ్యవహారం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ మీడియా మొత్తం రాజ్ తరుణ్ లావణ్య గురించే మాట్లాడుకుంటున్నారు. ఇందులో భాగంగా లావణ్య కు సంబంధించి రాజ్ తరుణ్ ఎన్నో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. అయితే తాజాగా లావణ్య గురించి ఓ సంచలన విషయం బయటపడింది.
What Lavanya is the heroine’s sister
అదేంటంటే లావణ్య ఆ హీరోయిన్ కి చెల్లెలు అని ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు రాజకీయ నాయకురాలు హీరోయిన్ అయినటువంటి మాధవి లత.. ప్రస్తుతం బిజెపిలో కీలకంగా ఉన్నటువంటి మాధవి లత కి లావణ్య కి మధ్య సంబంధం ఉందని, వీరిద్దరూ అక్క చెల్లెళ్లు అంటూ నెట్టింట్లో ఓ షాకింగ్ వార్త చక్కర్లు కొడుతుంది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని కొట్టిపారేశారు.ఎందుకంటే మాధవి లతకు చెల్లెళ్లు లేరు ఆమెకు అన్నయ్యలే ఉన్నారు. (Lavanya )
Also Read: Raj Tarun: ఆ ఒక్క కారణంతో లావణ్యను వదిలించుకోవాలనుకున్న రాజ్ తరుణ్..?
అలాగే అక్క చెల్లెళ్ల అనుబంధం ఉంది అనడానికి కారణం రాజ్ తరుణ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాక మాధవి లతకి లావణ్య పరిచయమైందట. దాంతో మాధవి లతని లావణ్య అక్క అని పిలవడం మొదలుపెట్టిందట. ఇక అప్పుడప్పుడు మాధవి లత ఇంటికి కూడా రాజ్ తరుణ్ తో కలిసి లావణ్య వెళ్లేదట. అలా అప్పటినుండి మాధవి లత కి లావణ్య కి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందట. అంతేకాకుండా మాధవి లత లావణ్య కి సినిమాలో చిన్న చిన్న అవకాశాలు కూడా ఇప్పించిందట.
అంతే కాదు లావణ్య పేరుతో సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఉండడంతో ఆమె పేరు కూడా అన్విక రావు గా మార్చుకుంది.అలాగే శంకరాభరణం మూవీలో లావణ్య ఓ చిన్న పాత్రలో కూడా నటించింది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి మాధవి లత చెల్లెలు అని చెప్పుకొని పరిచయం అవ్వడంతో అందరూ లావణ్య మాధవీ లత చెల్లెలు అని అనుకుంటున్నారు.కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు.(Lavanya )