Whats App Update: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ వలన మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. వినియోగదారులను ఆకట్టుకోవడానికి వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లని తీసుకు వస్తోంది. వాట్సాప్ లో మెటా ఫీచర్ గత నెలలో భారత దేశంలో ప్రారంభమైంది. ఇప్పుడు వాట్సాప్ తో సహా అన్ని మెటా ప్లాట్ ఫామ్ లలో అందుబాటులో ఉంది. గో టు మెసేజ్ ప్లాట్ ఫామ్ లలో వాట్సాప్ మెటా ఉచితంగా ఉపయోగించవచ్చు. మనకు వచ్చిన ఏ డౌట్ అయినా కూడా మెటా లో టైప్ చేసే సెండ్ చేస్తే దానికి సంబంధించిన ఆన్సర్ వచ్చేస్తుంది.
Whats App Latest Update
ఇంకాస్త చేరువు చేయడానికి వాట్సాప్ మరో కొత్త ఫీచర్ పై పని చేస్తోంది. మెటా ఏఐ ని ఉపయోగించి అవతార్లను సృష్టించేలా అప్డేట్ ను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ తాజా అప్డేట్ గురించి మరిన్ని వివరాలను చూద్దాం.. రాబోయే కొత్త వినియోగదారులకు సంబంధించిన ఏఐ పవర్ డివైజ్ లను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది రాబోయే ఫీచర్ మెటా సహాయంతో సృష్టించిన ఫోటోలను తీయడానికి వినియోగదారులకు పర్మిషన్ ఇస్తుంది.
Also read: KTR: నేడు గ్రేటర్ కార్పోరేటర్లతో కేటీఆర్ కీలక సమావేశం..!
వినియోగదారులు ఈ చిత్రాలను రూపొందించడానికి విశ్లేషించే సెటప్ ఫోటోలను తప్పక తీయాలి అయితే దాని తర్వాత వచ్చిన చిత్రాలు వాటి రూపాన్ని కచ్చితంగా సూచిస్తాయి. సెట్టింగ్‌ల ద్వారా తమ సెటప్ ఫోటోలను ఎప్పుడైనా తొలగించొచ్చు. కాబట్టి వినియోగదారులు ఈ ఫీచర్ పై పూర్తి నియంత్రణను కలిగి ఉండడం ద్వారా ఇమేజ్ ని రూపొందించమని వినియోగదారులు అడగొచ్చు. అలాగే వినియోగదారులు @Meta AI imagine me ఇలా టైప్ చేయడం ద్వారా ఇతర చాట్లలో ఈ ఫీచర్ ని ఉపయోగించగలరు. కమాండ్ విడిగా ప్రాసెస్ చేస్తున్నందుకు మెటా ఇతర సందేశాలను చదవదు. అందువలన వినియోగదారు గోప్యత ఎప్పుడు భద్రంగా ఉంటుంది (Whats App Update).