Priyamani: ఏంటి ప్రియమణికి సంబంధించిన ఫోటోలు బయటపెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారా.. ఇంతకీ ప్రియమణికి సంబంధించిన సీక్రెట్ ఫోటోలు ఏంటి? ఆమెను ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. తెలుగు చిత్ర సీమ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రమే తమ నటనతో ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతారు.
Who is blackmailing Priyamani by putting out those photos
అలాంటి వారిలో ప్రియమణి కూడా ఒకరు. ఈమె జగపతిబాబుతో కలిసి పెళ్లైన కొత్తలో మూవీలో నటించి మొదటి మూవీ తోనే హిట్ కొట్టింది. అలా తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోలతో జతకట్టిన ప్రియమణి ఇప్పటికి కూడా సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.అయితే అలాంటి ప్రియమణి తాజాగా ఓ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. (Priyamani)
Also Read: Pawan Kalyan: సొంత అన్నకి సపోర్ట్ ఇవ్వకుండా పవన్ ఏం పీకాడు.. పోసాని సంచలన కామెంట్స్..?
నేను వేరే మతస్తుడు అయినటువంటి ముస్తఫా రాజ్ ని పెళ్లి చేసుకోవడంతో పెళ్లైనప్పటినుండి ఇప్పటివరకు నన్ను ఎంతో మంది ట్రోల్ చేస్తున్నారు. అంతే కాదు మా ఇద్దరికి సంబంధించిన పెళ్లి ఫోటోలు బయట పెడుతూ మమ్మల్ని చాలా విమర్శలు చేస్తున్నారు. కానీ ఎన్నిసార్లు ట్రోల్ చేసినా మేము పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ప్రేమకు కులం, మతం అనే భావన ఉండదు అనే విషయం వారికి తెలియదు కావచ్చు.
ఇక ఈ ట్రోల్స్ 2016 నుండి వస్తూనే ఉన్నాయి. 2016లో ఎప్పుడైతే నేను ముస్తఫా రాజ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నానో అప్పటినుండి నన్ను ఇండస్ట్రీలో ఉన్న వారితోపాటు చాలామంది బయటి వాళ్లు కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు.కానీ నేను ట్రోలర్స్ ని అస్సలు పట్టించుకోను. మా పెళ్ళైనప్పటినుండి ఇప్పటివరకు ఎంతోమంది ట్రోల్ చేస్తున్నారు. పెళ్ళై ఎనిమిది సంవత్సరాలు దాటుతున్నా కూడా మాపై వచ్చే ఈ ట్రోల్స్ ఆగడం లేదు అంటూ ప్రియమణి తన బాధను బయటపెట్టి ఎమోషనల్ అయింది.(Priyamani)