Sobhitha: ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు శోభిత ధూళిపాల.. తెనాలిలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ తెలుగు అమ్మాయి అయినప్పటికీ హాలీవుడ్ సినిమాల్లో సైతం నటించి తన సత్తా ఏంటో నిరూపించుకుంది.అలాగే బాలీవుడ్ లో రాణించిన ఈ ముద్దుగుమ్మ సౌత్ లో కూడా హీరోయిన్ గా చేసింది.అలాంటి ఈ హీరోయిన్ ఒకసారి జాక్ పాట్ కొట్టేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీలో ఒక్కటయినా అక్కినేని ఇంటికి పెద్ద కోడలుగా వెళ్లే అదృష్టం ఈమెకు దక్కింది.
Who is Sobhitha ex boy friend
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ నాగచైతన్య తో ప్రేమాయణం నడిపించక ముందు మరో వ్యక్తిని ప్రేమించిందట. అంతేకాదు ఆ వ్యక్తితో పెళ్లికి కూడా సిద్ధమైందట. మరి అలాంటి వీరి పెళ్లికి అడ్డు ఎక్కడ వచ్చిపడింది..ఇంతకీ నాగచైతన్య కంటే ముందు శోభిత ప్రేమించిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. శోభిత ధూళిపాల తెలుగు అమ్మాయి హాలీవుడ్ రేంజ్ లో ఎదిగింది .(Sobhitha)
Also Read: Preetham: చైతూ ఎంగేజ్మెంట్ పై షాకింగ్ పోస్ట్ పెట్టిన సమంత రూమర్డ్ బాయ్ ఫ్రెండ్..?
అయితే అలాంటి ముద్దుగుమ్మ గతంలో అంటే 2019లో ఫ్యాషన్ ఈవెంట్లో ప్రణవ్ మిశ్రా అనే ఫ్యాషన్ డిజైనర్ ని కలిసింది. ఆ సమయంలో ఏర్పడిన వీరి పరిచయం కాస్త ప్రేమగా దారి తీసిందట. అలా వీరిద్దరూ చాలా రోజుల చట్టాపట్టాలేసుకొని తిరిగి డేటింగ్ చేశారు. ఇక ప్రణవ్ మిశ్రా ప్రముఖ లగ్జరీ బ్రాండ్ అయినటువంటి హ్యూమన్ సహ వ్యవస్థాపకుడు కూడా.
అలా చాలా రోజులు డేటింగ్ లో ఉన్న ఈ ఇద్దరూ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకున్నారట. అయితే గతంలో ఈ జంట పెళ్లికి కూడా రెడీ అయ్యారట.కానీ ఏమైందో ఏమో కానీ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. అలా నాగచైతన్యత తో పెళ్లి కంటే ముందే మరో వ్యక్తిని శోభిత ప్రేమించిందట.అయితే తాజాగా శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్ అవుతున్న వేళ శోభిత తన మొదటి బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫొటోస్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.(Sobhitha)