Hero: ఆయన ఒక స్టార్ హీరో.. అయితే టాలీవుడ్ కాదు బాలీవుడ్ అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచితుడే. ఇక ఈయన రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రస్తుతం మొదటి భార్య కి విడాకులు ఇచ్చి రెండో భార్యతోనే ఉంటున్నారు. అయితే ఆయన భార్య ఆయనకు నిద్రమాత్రలు ఇచ్చిందట. మరి అలా ఎందుకు ఇచ్చింది దాని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ అందరికీ తెలుసు. ఈయన ఆది పురుష్ మూవీలో రావణుడిగా చేసి పాన్ ఇండియా నటుడిగా మారిపోయారు. అయితే అలాంటి హీరో రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
Who is the wife who wanted to kill Hero by giving him sleeping pills
మొదట అమృత సింగ్ అనే నటిని పెళ్లి చేసుకుని 13 సంవత్సరాలు కాపురం చేశాక ఆమెకు విడాకులు ఇచ్చి హీరోయిన్ కరీనాకపూర్ ని పెళ్లాడాడు. అయితే మొదట అమృత సింగ్ తో కలిసి ఉన్న సమయంలో సైఫ్ అలీ ఖాన్ కి నిద్ర మాత్రలు ఇచ్చిందట.అయితే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఫిలిం మేకర్ సూరత్ బర్జాత్యా బయటపెట్టారు.ఆయన మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, టబు, సోనాలి బింద్రే ల కాంబినేషన్లో హమ్ సాత్ సాత్ హై అనే మూవీ వచ్చింది. (Hero)
Also Read: Heroine: కోటీశ్వరుల సంబంధాలు వచ్చినా ఆ చిన్న డైరెక్టర్ ని పెళ్లాడిన హీరోయిన్.?
అయితే ఈ సినిమాలో బాగా నటించాలి అనే ఉద్దేశంతో సైఫ్ అలీఖాన్ అసలు నిద్ర కూడా పోలేదట. దాంతో సినిమా షూటింగ్ సమయంలో చాలా టేక్స్ తీసుకొని అందరిని ఇబ్బంది పెట్టారు.అయితే నిద్రపోకుండా స్ట్రెస్ కి ఫీల్ అవుతున్నాడు అనే విషయం సైఫ్ అలిఖాన్ భార్య అమృత ద్వారా నేను తెలుసుకున్నాను. అంతేకాదు నిద్ర పోకపోవడం వల్లే ఇలా నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుంటున్నారు అని అమృత చెప్పడంతో ఆయన పడుకునే ముందు ఆయనకు తెలియకుండా స్లీపింగ్ పిల్స్ ఇవ్వు అని నేను సలహా ఇవ్వడంతో అమృత నేను చెప్పినట్లే చేసింది.
అలా సైఫ్ అలీఖాన్ కి తెలియకుండా ప్రతిరోజు అమృత నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రపోయేలా చేసింది. ఇక అలా ప్రతిరోజు హాయిగా నిద్ర పోయిన సైఫ్ అలీ ఖాన్ ఆ తర్వాత రోజు షూటింగ్ టైంలో చాలా యాక్టివ్ గా ఉండటమే కాకుండా ఒకే టేక్ లో కరెక్ట్ గా చేయడంతో చాలామంది షాక్ అయ్యారు.అలా ఆరోజు నేను అమృతకి చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయింది అంటూ సూరత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతూ నిద్రమాత్రలు ఇచ్చి సైఫ్ అలీ ఖాన్ ని చంపేద్దామనుకుందా ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Hero)