Who is the woman who insulted Akkineni Akhil

Akhil: తెలుగు సినిమా ఇండస్ట్రీకి సీనియర్ ఎన్టీఆర్ ఒక కన్ను అయితే మరోకన్ను అక్కినేని నాగేశ్వరరావు. ఇలా ఇండస్ట్రీలో వాళ్ళు ఎదుగుతూ ఇండస్ట్రీని కూడా ఎదిగేలా చేసిన గొప్ప నటులు. అలాంటి అక్కినేని నాగేశ్వరరావు తెలుగులో చాలా అద్భుతంగా ఉచ్చరించేవారట. ఆయన డైలాగ్స్ ఎంతో అద్భుతంగా చెప్పేవారట. అలా తెలుగుపై ఎంతో మక్కువ ఉండే నాగేశ్వరరావు పరువును ఆయన మనవడు అఖిల్ తీసేసాడని ఒక తెలుగు టీచర్ అన్నదట.

Who is the woman who insulted Akkineni Akhil

అంతేకాదు అఖిల్ ని బండ బూతులు తిట్టిందట. మరి ఆ టీచర్ ఎవరు వివరాలు ఏంటో చూద్దాం.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని వారసులుగా నాగార్జున స్టార్ హీరోగా ఎదిగారు. ఇక అక్కినేని మూడవ తరం హీరోలుగా నాగచైతన్య, అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక నాగచైతన్య ఓ మోస్తారుగా పేరు తెచ్చుకున్నా కానీ అఖిల్ ఇంకా హీరోగా నిలదొక్కుకోవవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి అఖిల్ ఆ మధ్య కాలంలో ప్రదీప్ నిర్వహించిన కొంచెం టచ్ లో ఉంటే చెబుతా అనే షోకి హాజరై తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని విషయాలను పంచుకున్నారు.(Akhil )

Also Read: Samantha: జాన్వీ కపూర్ కి వదిన కాబోతున్న సమంత.. ఆ హీరోతో రెండో పెళ్లి.?

ఇంతకీ ఆయన ఏమన్నారయ్యా అంటే..నేను మొత్తం ఇంగ్లీష్ మీడియం లో చదువుకున్నాను. కానీ నాకు తెలుగు రాయడం చదవడం వచ్చు అని చెప్పారు. దీనికి ప్రధాన కారణం సరోజా అనే తెలుగు టీచర్ అని, చెప్పుకొచ్చారు.. అయితే ఒక రోజు టీచర్ దసరా పండుగ రోజు ఏం చేస్తారు అని ఒక వ్యాసం రాయమందట. అఖిల్ తనకు వచ్చింది రాసేసరికి టీచర్ క్లాసులో పిల్లలందరి బయటకు పంపి అఖిల్ రాసింది చెబుతూ ఏడ్చిందట. మీ తాతయ్యకు నేను వీరాభిమానిని.

Who is the woman who insulted Akkineni Akhil

ఆయన ఎంతో బాగా తెలుగు మాట్లాడతారు.. ఆయన వంశంలో నువ్వెలా పుట్టావురా ఎదవా అంటూ బం బూతులు తిట్టిందట. చివరికి అమల నెంబర్ తీసుకొని చాలా బాధపడిందట.. నాకు తెలుగు రాయడం, చదవడం వచ్చేవరకు ఆ టీచర్ నా వెంబడి పడిందని, ఆమె వల్లే ఈరోజు నేను తెలుగు రాస్తున్నాను, చదువుతున్నానని చెప్పుకొచ్చారు అఖిల్. అంతేకాదు సరోజ మేడంకు ప్రత్యేక థాంక్స్ చెబుతున్నారని అన్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Akhil )