Why Akhil Akkineni is Choosing Big Budget Films Again

Akhil Akkineni: అఖిల్ అక్కినేని నటించిన “ఏజెంట్” సినిమా పరాజయం కోలుకోలేని దెబ్బ తీసింది. సినిమా విజయానికి భారీ బడ్జెట్ సరిపోదని, మంచి కథ, కథనాలు, మరియు అద్భుతమైన స్క్రీన్‌ప్లే ముఖ్యమని అఖిల్ ఈ సినిమా తో క్లియర్ గా తెలుసుకున్నారు. గత సంవత్సరం మొత్తం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారు. అయితే, తాజాగా ఆయన మళ్లీ భారీ బడ్జెట్ సినిమాల వైపు అయన చూస్తున్నట్లు సమాచారం.

Why Akhil Akkineni is Choosing Big Budget Films Again

ప్రస్తుతం, అఖిల్ రెండు ప్రధాన సినిమాల్లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. UV క్రియేషన్స్ బ్యానర్‌లో నూతన దర్శకుడు అనిల్ దర్శకత్వంలో ఒక సినిమా, మరియు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో “వినరో భాగ్యము విష్ణు కథ” ఫేమ్ మురళి అబ్బురు దర్శకత్వంలో మరో సినిమా అయన హీరో గా రూపొందుతున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు చిత్రాలకు సుమారు 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించబడిందని చెబుతున్నారు. UV క్రియేషన్స్ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుందని, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాజెక్ట్ పీరియాడిక్ డ్రామాగా ఉంటుందని సమాచారం.

Also Read: Amaran: ‘అమరన్’ తెలుగుపై దృష్టి పెట్టని నిర్మాతలు.. అసలు బజ్ లేదుగా!!

అఖిల్ గతంలో చేసిన సినిమాల బాక్సాఫీస్ వసూళ్లు అంత తృప్తికరంగా లేకపోవడం గమనించాల్సి ఉంది. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” తప్ప మిగతా సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయాయి. దీంతో, అఖిల్ మళ్లీ భారీ బడ్జెట్ సినిమాలను ఎంచుకోవడం ఏంటనే అంశం చర్చనీయాంశంగా మారింది. చిన్న సినిమాలను చేస్తే, అవి ఫ్లాప్ అయినా పెద్దగా నష్టం ఉండదు. కానీ, భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాప్ అయితే, ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉన్నందున, మార్కెట్ కూడా పడిపోతుంది.

ఈ పరిస్థితుల్లో, OTT డీల్స్ రాకపోవడం, ప్రేక్షకుల నుంచి స్పందన తగ్గడం వంటి సమస్యలు అఖిల్ కెరీర్‌పై ప్రభావం చూపవచ్చు. అందుకే, అభిమానులు అఖిల్ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని, తన తదుపరి సినిమాలను జాగ్రత్తగా ఎంచుకోవాలని కోరుకుంటున్నారు. అఖిల్ తక్కువ బడ్జెట్ చిత్రాలను పరిశీలించడం వల్ల మరింత మంచి విజయాలను సాధించగలడు అని చెప్తున్నారు.