Shakib Al Hasan: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ ఆల్ హసన్ తన నోటిలో నల్ల దారం నములుతూ బ్యాటింగ్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. Shakib Al Hasan
Why was Shakib Al Hasan biting his helmet strap while batting in 1st IND vs BAN test in Chennai
షకీబ్ ఆల్ హాసన్ ఎప్పుడు ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. అయితే అతని దూకుడు స్వభావం గురించి అందరికీ తెలిసిందే. ఇక భారత్ తో జరిగిన మొదటి టెస్టులో షకీబ్ ఆల్ హసన్ 32 పరుగులు చేశాడు. 64 బంతుల్లో మొత్తం 5 ఫోర్ల సాయంతో ఈ పరుగులు సాధించాడు. అయితే రవీంద్ర జడేజా బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి ధ్రువ్ జురెల్ కు చిక్కాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. షకీబ్ ఇన్నింగ్స్ కంటే అతను నల్లదారం నములుతూ బ్యాటింగ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు ఎవరూ కూడా ఇలా బ్యాటింగ్ చేయలేదు. షకీబ్ చేసిన పనికి కామెంటేటర్ దినేష్ కార్తీక్ సైతం షాక్ అయ్యాడు. Shakib Al Hasan
Also Read: Rohit Sharma: విరాట్ కోహ్లి మీద చిరకుపడ్డ రోహిత్.. బంగ్లా మ్యాచ్ లో విడ్డూరం!!
అతను నోటిలో నల్ల దారం ఉంచుకొని బ్యాటింగ్ చేయడానికి గల కారణం తమీమ్ ఇక్బాల్ వివరించాడు. దానికి గల కారణమేంటంటే…. ఈ దారం షకీబ్ ఏకాగ్రతతో బ్యాటింగ్ చేయడానికి సహాయం చేస్తుందట. ముఖాన్ని అటూ ఇటూ తిప్పకుండా బంతిపైనే దృష్టి పెట్టడానికి షకీబ్ ఇలా నల్లదారం నములుతూ బ్యాటింగ్ చేశాడని తమీమ్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టుపై టీమిండియా పైచేయి సాధిస్తుంది. Shakib Al Hasan