Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది “గుంటూరు కారం” సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం, మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందించబడుతున్న సినిమా. “ఆర్ఆర్ఆర్” వంటి బ్లాక్ బస్టర్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

Will Mahesh Babu Star in Another Film Before Rajamouli Film

ఈ సినిమా కోసం మహేష్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. గుబురు గడ్డంతో కొత్తగా కనిపిస్తున్న ఆయన, జిమ్‌లో కఠోరంగా శ్రమించి, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే, రాజమౌళి సినిమా పూర్తి చేయడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుందనే సమాచారం రావడంతో, మహేష్ అభిమానులు కొంత నిరాశ చెందారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో మహేష్ మరో సినిమా చేయకపోవడం వల్ల, అభిమానులు ఆయనను తెరపై చూడలేకపోతారు. రాజమౌళి సినిమా ప్రారంభానికి ముందు, ఆయన చిన్న సినిమా చేసుకుంటే బాగుండేదని వారు భావిస్తున్నారు.

Also Read : Ravi Teja Daughter: త్వరలోనే సినిమాల్లోకి మాస్ మహారాజా రవితేజ కూతురు!!

కానీ, మహేష్ ఇప్పటికే తన లుక్‌ను మార్చుకోవడంతో, ఈ లుక్‌తో వేరే సినిమా చేయడం సాధ్యం కాకపోవడంతో, ఆయన అభిమానులు మూడు సంవత్సరాలు ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. రాజమౌళి-మహేష్ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రం జనవరిలో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. త్వరలో జరగబోయే ఓ సమావేశంలో రాజమౌళి ఈ సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా భారీ స్థాయిలో రాజమౌళి రూపొందిస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. మహేష్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని వారు నమ్ముతున్నారు.