Amit Shah: దేశంలో ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అనూహ్యంగా మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చింది. 2014 మరియు 2019 కంటే ఈసారి మోడీ ప్రభుత్వానికి సీట్లు తక్కువ వచ్చాయి. దీంతో మిత్రపక్షాలతో మోడీ ప్రభుత్వం మూడోసారి ముచ్చటగా ఏర్పాటు అయింది. 273 మ్యాజిక్ ఫిగర్ కాగా… 240 దగ్గరే బిజెపి ఆగిపోయింది. Amit Shah
Will Modi government collapse Amit Shah sensational statement
దీంతో మోడీ ప్రభుత్వానికి తెలుగుదేశం అలాగే జెడియు సపోర్ట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో మూడోసారి మోడీ ప్రధానమంత్రి కాగలిగారు. అయితే తరచూ… మోడీ ప్రభుత్వం పై కాంగ్రెస్ కూటమి కామెంట్స్ చేస్తోంది. ఏ క్షణమైనా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉందని కాంగ్రెస్ అగ్ర నేతలు అంటున్నారు. Amit Shah
Also Read: TDP: లగ్జరీ కార్లు కొన్న TDP ఎమ్మెల్యేలు… భారీ స్కాం జరిగిందా?
అయితే దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి ఎలాంటి డోఖా లేదని క్లారిటీ ఇచ్చారు. 2029 ఎన్నికల్లో కూడా మోడీ ప్రభుత్వం రాబోతుందని అమిత్ షా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు.. ఎక్కడ పని లేదని… అందుకే ఇలాంటి తప్పుడు వార్తలు వైరల్ చేస్తున్నారని అమిత్ షా ఫైర్ అయ్యారు. Amit Shah
కాగా… కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు అలాగే నితీష్ కుమార్ ప్రాణవాయువు లెక్క తయారయ్యారు. అటు ఎన్డీఏ కూటమికి 240 సీట్లు వరకు ఉన్నాయి. ఇండియా కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలు ఒకరి మాట ఒకరి వినవు. కాబట్టి మోడీ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. Amit Shah