Aishwarya: ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ లు బాలీవుడ్ లో ఉన్న మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్స్ లో వీళ్లు కూడా ఒకరు. అయితే వీరికి పెళ్లికి ముందు ఎన్ని రిలేషన్స్ అయినా ఉండని కానీ పెళ్లయ్యాక మాత్రం ఒకరితో ఒకరు చాలా పవిత్రంగా ఎలాంటి బయటి రిలేషన్స్ మెయింటైన్ చేయకుండా చాలా అన్యోన్యంగా ఉన్నారు. అయితే అలాంటి ఈ అన్యోన్యంగా ఉండే ఈ జంటకు ఎవరి దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ గత కొద్దిరోజులుగా కాస్త దూరం దూరంగా ఉంటున్నారు.
Will that heroine Aishwarya divorce Abhishek
ఇక రీసెంట్ గా అంబానీ పెళ్లితో వీరి మధ్య ఉన్న దూరం పూర్తిగా బయటపడింది అంటున్నారు కొంతమంది బాలీవుడ్ జనాలు. ఎందుకంటే అంబానీ పెళ్లిలో ఈ జంట కలిసే రాలేదు.విడివిడిగా రావడంతో వీరి విడాకుల వార్తలు మరింత ఉపందుకున్నాయి. అలాగే ఈ పెళ్లిలో ఐశ్వర్య అభిషేక్ కలిసి ఫోటో దిగలేదు. అంతే కాకుండా ఐశ్వర్య తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ తో దిగిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. దీంతో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ లు నిజంగానే విడాకులు తీసుకుంటున్నారని బీ టౌన్ జనాలందరూ గుసగుసలు పెట్టుకుంటున్నారు.(Aishwarya )
Also Read: Kanchi Kaul సంపంగి హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో చూడండి?
అయితే తాజాగా వీరి విడాకుల కారణం ఆ హీరోయిన్ అంటూ ఓ రూమర్ వినిపిస్తోంది.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే బాలీవుడ్ నటి రేఖ అంటూ ఓ టాక్ వినిపిస్తోంది. అయితే రేఖకు వీరి ఫ్యామిలీ పై ఎందుకు అంత పగ.. ఆ ఇద్దరిని విడదీయాలని రేఖ ఎందుకు చూస్తుందని కొంతమంది భావిస్తున్నారు. అయితే అంబానీ ఫ్యామిలీలో జరిగిన పెళ్లిలో రేఖ ఐశ్వర్య లు మాట్లాడుకున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
దీంతో కొంతమంది జనాలు ఐశ్వర్య అభిషేక్ ల విడాకులకు రేఖనే కారణమైంది కావచ్చు. ఎందుకంటే ఈమె ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ నీ గాఢంగా ప్రేమించింది కదా. అందుకే వారి ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్ళలేదు కాబట్టి ఆ పగ ఇలా తీర్చుకుంటుంది కావచ్చు అని కొంతమంది నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని,రేఖ అలాంటిది కాదు అని,రేఖా అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి చాలా సన్నిహితురాలు అని కొంతమంది బాలీవుడ్ జనాలు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు.(Aishwarya )