Xiaomi SU7 Electric: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల వాహనాలు…వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో చాలా రకాల… ఎలక్ట్రిక్ కార్లు… లాంచ్ అవుతున్నాయి. మన ఇండియా వ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. Xiaomi SU7 Electric
Xiaomi SU7 Electric 800 mileage on a single charge
పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు లీటర్ కు దాదాపు 100 రూపాయలు ఇప్పటికే దాటిపోయాయి. ఇంకా వీటి ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇలాంటి నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు మాత్రమే ఆసక్తిని చూపిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీలు ఎక్కువగా ఎలక్ట్రిక్ కారులను తీసుకువస్తున్నాయి. Xiaomi SU7 Electric
Also Read:
అయితే… తాజాగా మార్కెట్లోకి మరో సరికొత్త కారు వచ్చేసింది. ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ అయిన… షియామీ తొలిసారిగా ఎలక్ట్రిక్ కారును తీసుకువచ్చింది. భారతీయ మార్కెట్లో తమ పదవ వార్షికోత్సవం… జరుపుకుంటున్న నేపథ్యంలో… ఈ షియామి ఎలక్ట్రిక్ కారును తీసుకువచ్చింది. స్పీడ్ అల్ట్రా SUV 7 పేరుతో ఈ కారును తీసుకువచ్చింది చైనాకు చెందిన షియామి కారు కంపెనీ. Xiaomi SU7 Electric
ఇక దీని ప్రారంభ ధర 30 వేల డాలర్ల పైన ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అంటే మన ఇండియన్ రుపీస్ లో 25 లక్షలు గా ఉంటుంది. అయితే టెస్లా మోడల్ 3 ప్రారంభ ధర కంటే నాలుగు వేల డాలర్లు తక్కువగా ఉంది. ఇక ఈ కారులో… సి టి బి ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ అందిస్తున్నారు. పైలట్ అటానమస్ డ్రైవింగ్ సిస్టం, స్మార్ట్ క్యాబిన్ కూడా ఉంటుంది. ఇక ఈ కారు ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే ఎనిమిది వందల కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. Xiaomi SU7 Electric