Ys Vijayamma: వైయస్ షర్మిల అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో… వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేలా… వైయస్ విజయమ్మ బాంబు పేల్చారు. బహిరంగ లేఖ రాసి… వైయస్ జగన్మోహన్ రెడ్డికి… చురకలు అంటించారు విజయమ్మ. తన కూతురుకు సపోర్ట్ గా విజయమ్మ. Ys Sharmila
Ys Vijayamma Letter On Ys Jagan And sharmila
నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు అంటూ బహిరంగ లేఖ రాసిన వైయస్ విజయమ్మ… సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. వైఎస్ ఉన్నప్పుడు ఆస్తులు పంచలేదు అని బాంబు పేల్చారు. ఈ మేరకు…వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ విడుదల చేయడం జరిగింది. వైఎస్ బతికుండగా షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారు అని లిస్ట్ చదివారు.. జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్ట్ కూడా చదివితే బాగుండేది అంటూ ఆగ్రహించారు వైఎస్ విజయమ్మ. Ys Sharmila
Also Read: Teenmar Mallanna: కేసీఆర్ పుణ్యం వల్లే… నేను ఎమ్మెల్సీ అయ్యాను ?
విడిపోదాం అని ఇజ్రాయెల్ లో జగన్ అన్నారన్నారు వైఎస్ విజయమ్మ. మనకు వచ్చే అల్లుడు, కోడలు.. మనలాగ కలిసి ఉండకపోవచ్చు… కాబట్టి విడిపోదాం అని జగన్ అన్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు విజయమ్మ. కాబట్టి ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగిందన్నారు వైఎస్ విజయమ్మ. జగన్ కోసం నిస్వార్థంగా కష్టపడ్డ షర్మిలకు అన్యాయం జరిగిందన్నారు. జగన్ అధికారంలోకి రావడానికి షర్మిల కృషి ఎంతో ఉందని వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. Ys Sharmila